జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా సర్పంచ్ గొరిగే ఉప్పలమ్మ బిక్షపతికి అవార్డు ప్రదానం

జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా సర్పంచ్ గొరిగే ఉప్పలమ్మ బిక్షపతికి అవార్డు ప్రదానం

లింగాల గణపురం (జనగాం) :జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా సర్పంచ్ గొరిగే ఉప్పలమ్మ బిక్షపతికి అవార్డు ప్రదానం జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలోని నాగారం గ్రామం టీబీ రహిత గ్రామంగా ఎంపికై అరుదైన గుర్తింపు సాధించింది. గ్రామంలో టీబీపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, వ్యాధి నిర్మూలనకు సహకరించినందుకు ఈ గుర్తింపు లభించింది. ఈ ఘనత గ్రామ ప్రజల ఐక్యత, ఆరోగ్య సిబ్బంది కృషికి నిదర్శనంగా నిలిచింది. ఈ సందర్భంగా గురువారం జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నాగారం గ్రామ సర్పంచ్ గొరిగే ఉప్పలమ్మ బిక్షపతిని జిల్లా కలెక్టర్ ఘనంగా సన్మానించి, అవార్డును అందజేశారు. నాగారం గ్రామాన్ని టీబీ రహిత గ్రామంగా తీర్చిదిద్దడంలో భాగస్వాములైన ఏఎన్ఎం, ఆశా వర్కర్, గ్రామ సిబ్బంది మరియు సంబంధిత ఆరోగ్య సిబ్బందికి గ్రామ ప్రజలు అభినందనలు తెలిపారు. ప్రజల ఆరోగ్యం, సంక్షేమం కోసం చేసిన కృషికి ఈ అవార్డు గుర్తింపుగా నిలుస్తుందని పేర్కొన్నారు. టీబీ రహిత గ్రామంగా నాగారం ఎంపిక కావడం పట్ల సర్పంచ్ గొరిగే ఉప్పలమ్మ బిక్షపతికి, గ్రామ ప్రజలకు, ఆరోగ్య సిబ్బందికి పలువురు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Views: 17

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఆర్యభట్ట హై స్కూల్‌లో ఘనంగా తెలంగాణ సంప్రదాయ బతుకమ్మ సంబురాలు ఆర్యభట్ట హై స్కూల్‌లో ఘనంగా తెలంగాణ సంప్రదాయ బతుకమ్మ సంబురాలు
బిచ్కుంద,  తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలను బిచ్కుంద మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని ఆర్యభట్ట హై స్కూల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా...
చౌటకూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ప్రభుత్వ వైద్యశాలలో విద్యార్థులకు మెరుగైన వైద్య విద్యను అందించాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.
ప్లాట్ పేరుతో రూ.67.20 లక్షల మోసం కేసులో మరో నిందితుడు అరెస్ట్
ఆదిలాబాద్‌లో త్వరలో 10 సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు: కలెక్టర్ రాజర్షిషా
జిల్లాలో భారీ భూ స్కాం.. ప్రోహిబిటేడ్ భూమికి రిజిస్ట్రేషన్
వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపడమే నా సంకల్పం.