పేదరికాన్ని జయించి ఎంబీబీఎస్ సీటు సాధించిన యువతి
చిన్న చిన్న కరెంటు పనులు చేసుకుంటూ కూతుర్ని చదివించిన నాన్న
మాగనూరు : ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు తల్లిదండ్రుల కష్టానికి తాను తోడుగా ఉంటూ డాక్టర్ కావాలనే లక్ష్యాన్ని సాధించుకుంది. ఎంబీబీఎస్ సీటు సాధించి శభాష్ అనిపించుకుంటుంది మాగనూర్ కు చెందిన బులిమెని మాధురి. కృషి పట్టుదల ఉంటే దేన్నైనా సాధించొచ్చు అని నిరూపించింది పేదరికం అనేది దేనికి అడ్డు కాదని ఏదైనా సాధించాలి అని ధృడ సంకల్పం ఉంటే చాలు మన కలలను సహకారం చేసుకోవడానికి మన నమ్మకమే నిజమైన బలం అంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది ఆ యువతి. మాగనూర్ గ్రామానికి చెందిన బులిమెని ఆంజనేయులు కుమార్తె కె. బులిమెని మాధురి. ఈ అమ్మాయి వనపర్తి ఇన్స్టిట్యూట్‌లో ఫ్రీ మెడికల్ సీటు సంపాదించి శభాష్ అనిపించుకుంటుంది. మాగనూర్ గ్రామానికి చెందిన బులిమెని మాధురి తండ్రి బులిమెని ఆంజనేయులు వృత్తి రీత్యా వ్యసాయం చేసుకుంటూ చిన్న చిన్న కరెంట్ రిపేర్లు నిర్వహిస్తున్నాడు. ఆమె తల్లి వ్యవసాయ కూలీ పనులు చేస్తూ కుటుంబానికి ఆర్థికంగా ఆసరాగా నిలుస్తుంది. మాధురి చిన్ననాటి నుంచే ఊర్లో ఏడవ తరగతి వరకు ప్రతిభ పాఠశాలలో చదివి 8వ తరగతి నుంచి 10 వరకు మక్తల్ లోని బ్రిలియంట్ పాఠశాల లో ఇంటర్మీడియట్ వరకు మహబూబ్ నగర్ లోని ఓ గురుకుల కళాశాల లో విద్యాభ్యాసం చేసింది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


