క్రిష్ణ మండలం కున్షి వద్ద కాలువ పూడికతీత పనులు

క్రిష్ణ మండలం కున్షి వద్ద కాలువ పూడికతీత పనులు

ప్రారంభించిన మంత్రి వాకిటి శ్రీహరి గారి సోదరుడు వాకిటి శేషగిరి గారు ...

మక్తల్ :నియోజకవర్గం క్రిష్ణ మండలం కున్షి గ్రామం వద్ద వ్యవసాయ పంట పొలాలకు సాగునీరు అందించే కాలువలలో పూడికతీత పనులను మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు  సోదరుడు వాకిటి శేషగిరి  ప్రారంభించారు.ఈసందర్భంగా వాకిటి శేషగిరి గారు మాట్లాడుతూ..క్రిష్ణ మండలం కున్షి గ్రామం నుంచి హిందుపూర్, తంగిడి కుసుమూర్తి, ఇటు చేగుంట వైపు సాగునీరు అందించే కాలువలలో పూడికతీత పనులను ప్రారంభించామని అన్నారు. నియోజకవర్గంలో దాదాపుగా అన్ని మండలాల్లో కాలువల పూడికతీత పనులు ఒక యజ్ణంలా కొనసాగుతున్నాయని, మంత్రి వాకిటి శ్రీహరి గారు ప్రత్యేక చొరవ తీసుకొని దశాబ్దాల తరబడి పూడుకుపోయిన కాలువలకు తిరిగి జీవం పోస్తున్నారని, రైతులపై మంత్రి గారికి ఉన్న ప్రత్యేక నిబద్దత ఇందుకు నిదర్శనమని కొనియాడారు. నూటికి నూరు శాతం కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వమని, ఇతరుల మాటలు నమ్మవద్దని కోరారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Views: 31

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఆర్యభట్ట హై స్కూల్‌లో ఘనంగా తెలంగాణ సంప్రదాయ బతుకమ్మ సంబురాలు ఆర్యభట్ట హై స్కూల్‌లో ఘనంగా తెలంగాణ సంప్రదాయ బతుకమ్మ సంబురాలు
బిచ్కుంద,  తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలను బిచ్కుంద మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని ఆర్యభట్ట హై స్కూల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా...
చౌటకూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ప్రభుత్వ వైద్యశాలలో విద్యార్థులకు మెరుగైన వైద్య విద్యను అందించాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.
ప్లాట్ పేరుతో రూ.67.20 లక్షల మోసం కేసులో మరో నిందితుడు అరెస్ట్
ఆదిలాబాద్‌లో త్వరలో 10 సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు: కలెక్టర్ రాజర్షిషా
జిల్లాలో భారీ భూ స్కాం.. ప్రోహిబిటేడ్ భూమికి రిజిస్ట్రేషన్
వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపడమే నా సంకల్పం.