ప్రజావాణిలో దివ్యాంగుడి విజ్ఞప్తికి స్పందించి బ్యాటరీ వాహనంను అందజేసిన  కలెక్టర్ 

ప్రజావాణిలో దివ్యాంగుడి విజ్ఞప్తికి స్పందించి బ్యాటరీ వాహనంను అందజేసిన  కలెక్టర్ 

కామారెడ్డి బ్యూరో : ప్రజావాణిలో దివ్యాంగుడి విజ్ఞప్తికి స్పందించి బ్యాటరీ వాహనంను అందజేసిన  కలెక్టర్  ప్రజావాణి కార్యక్రమంలో బిచ్కుంద మండలానికి చెందిన దివ్యాంగుడుగండ మల్లా గంగాధర్, చేసిన విజ్ఞప్తికి స్పందించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, శుక్రవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్ సమీపంలో ఆయనకు బ్యాటరీ విల్ చైర్ అందజేశారు.ప్రజావాణికి వచ్చిన దివ్యాంగుడు తన ఇబ్బందులను జిల్లా కలెక్టర్‌కు వివరించి, తన రోజువారీ అవసరాలకు, జీవనోపాధికి ఉపయోగపడేలా బ్యాటరీ వాహనం అందించాలని కోరారు. ఆయన పరిస్థితిని సానుకూలంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్, మరుసటి రోజు కలెక్టరేట్‌కు పిలిపించి బ్యాటరీ వాహనాన్ని అందజేశారు.ప్రజల సమస్యలను సానుభూతితో అర్థం చేసుకుని, అర్హులైన వారికి అవసరమైన సహాయం అందించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎన్.వై. గిరి డి డబ్ల్యుఓ వెంకటేష్, పాల్గొన్నారు.

Views: 58

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఆర్యభట్ట హై స్కూల్‌లో ఘనంగా తెలంగాణ సంప్రదాయ బతుకమ్మ సంబురాలు ఆర్యభట్ట హై స్కూల్‌లో ఘనంగా తెలంగాణ సంప్రదాయ బతుకమ్మ సంబురాలు
బిచ్కుంద,  తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలను బిచ్కుంద మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని ఆర్యభట్ట హై స్కూల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా...
చౌటకూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ప్రభుత్వ వైద్యశాలలో విద్యార్థులకు మెరుగైన వైద్య విద్యను అందించాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.
ప్లాట్ పేరుతో రూ.67.20 లక్షల మోసం కేసులో మరో నిందితుడు అరెస్ట్
ఆదిలాబాద్‌లో త్వరలో 10 సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు: కలెక్టర్ రాజర్షిషా
జిల్లాలో భారీ భూ స్కాం.. ప్రోహిబిటేడ్ భూమికి రిజిస్ట్రేషన్
వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపడమే నా సంకల్పం.