మిడ్జిల్ మండలంలో ఉచిత పశువైద్య శిబిరం

మిడ్జిల్ మండలంలో ఉచిత పశువైద్య శిబిరం

27 పాడి పశువులకు చికిత్సలు.. 17 దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీ

మిడ్జిల్, :  మిడ్జిల్ మండల పరిధిలోని సుభ్య తాండా (ఇద్దుల భాయ్ తాండా) గ్రామంలో పశు వైద్య, పశుసంవర్ధక శాఖ మరియు తెలంగాణ రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ సమన్వయంతో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో పశువుల గర్భకోశ వ్యాధుల నివారణపై పరీక్షలు, చికిత్సలు నిర్వహించడంతో పాటు పాడి రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మొత్తం 27 పాడి పశువులకు చికిత్సలు అందించగా, 17 దూడలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. పశువుల ఆరోగ్య పరిరక్షణ, పాడి పరిశ్రమ అభివృద్ధి, రైతులకు మెరుగైన పశువైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాడి పరిశ్రమ అభివృద్ధిపై రైతులకు అవగాహన ఈ సందర్భంగా మండల పశువైద్యాధికారి డాక్టర్ అనుప శివరాజ్ మాట్లాడుతూ, ఎల్‌నినో వంటి వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ పాడి పరిశ్రమను అభివృద్ధి చేసుకునే విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయంతో పాటు పశుసంపదను పెంపొందించుకోవడం ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని వివరించారు. పశువుల పోషణ, సెక్స్ సార్టెడ్ సీమెన్ సాంకేతికత ద్వారా ఆడ దూడలు పుట్టే అవకాశాలను పెంచడం, రాయితీపై గడ్డి విత్తనాల పంపిణీ, పశువులకు సకాలంలో టీకాలు వేయించడం వంటి అంశాలపై సూచనలు చేశారు. అలాగే VB-G RAMG పథకం ద్వారా పశువుల షెడ్ల నిర్మాణం, అవసరమైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి డాక్టర్ అనుప శివరాజ్, గ్రామ సర్పంచ్ ధర్మా నాయక్, ఉపసర్పంచ్ రవి నాయక్, గ్రామ పెద్దలు, పాడి రైతులు పాల్గొన్నారు.  పశువైద్య సిబ్బంది సత్యం (JVO), దామోదర్ (VLO), సత్యం (OS)తో పాటు గోపాల మిత్రులు యాదగిరి, రామకృష్ణ, నర్సింలు, మల్లేష్, వేణుగోపాల్ చారి పాల్గొన్నారు  

WhatsApp Image 2026-10-09 at 1.32.04 PM

Views: 128

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఆర్యభట్ట హై స్కూల్‌లో ఘనంగా తెలంగాణ సంప్రదాయ బతుకమ్మ సంబురాలు ఆర్యభట్ట హై స్కూల్‌లో ఘనంగా తెలంగాణ సంప్రదాయ బతుకమ్మ సంబురాలు
బిచ్కుంద,  తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలను బిచ్కుంద మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని ఆర్యభట్ట హై స్కూల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా...
చౌటకూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ప్రభుత్వ వైద్యశాలలో విద్యార్థులకు మెరుగైన వైద్య విద్యను అందించాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.
ప్లాట్ పేరుతో రూ.67.20 లక్షల మోసం కేసులో మరో నిందితుడు అరెస్ట్
ఆదిలాబాద్‌లో త్వరలో 10 సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు: కలెక్టర్ రాజర్షిషా
జిల్లాలో భారీ భూ స్కాం.. ప్రోహిబిటేడ్ భూమికి రిజిస్ట్రేషన్
వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపడమే నా సంకల్పం.