ఆర్యభట్ట హై స్కూల్‌లో ఘనంగా తెలంగాణ సంప్రదాయ బతుకమ్మ సంబురాలు

ఆర్యభట్ట హై స్కూల్‌లో ఘనంగా తెలంగాణ సంప్రదాయ బతుకమ్మ సంబురాలు

బిచ్కుంద,  తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలను బిచ్కుంద మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని ఆర్యభట్ట హై స్కూల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రంగురంగుల పూలతో అందమైన బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటపాటలతో ఉత్సాహంగా సంబురాలు జరుపుకున్నారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ప్రేమకు, సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ విశిష్టతను విద్యార్థులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ అశోక్ సార్ మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయడం, విద్యార్థుల్లో మన సంస్కృతి పట్ల గౌరవం పెంపొందించడం లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడంతో పాఠశాల ప్రాంగణం బతుకమ్మ పాటలు, ఆటలతో సందడిగా మారింది. తెలంగాణ సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి.

WhatsApp Image 2026-10-09 at 5.57.43 PM

Views: 198

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఆర్యభట్ట హై స్కూల్‌లో ఘనంగా తెలంగాణ సంప్రదాయ బతుకమ్మ సంబురాలు ఆర్యభట్ట హై స్కూల్‌లో ఘనంగా తెలంగాణ సంప్రదాయ బతుకమ్మ సంబురాలు
బిచ్కుంద,  తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలను బిచ్కుంద మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని ఆర్యభట్ట హై స్కూల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా...
చౌటకూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ప్రభుత్వ వైద్యశాలలో విద్యార్థులకు మెరుగైన వైద్య విద్యను అందించాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.
ప్లాట్ పేరుతో రూ.67.20 లక్షల మోసం కేసులో మరో నిందితుడు అరెస్ట్
ఆదిలాబాద్‌లో త్వరలో 10 సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు: కలెక్టర్ రాజర్షిషా
జిల్లాలో భారీ భూ స్కాం.. ప్రోహిబిటేడ్ భూమికి రిజిస్ట్రేషన్
వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపడమే నా సంకల్పం.