నగరంలో విషాదం...
- అగ్నిప్రమాదంలో గాయపడ్డ తండ్రీకొడుకులు మృతి
- ప్రమాదవశాత్తు ఇంటికి నిప్పంటుకోగా గాయపడ్డ తండ్రీకొడుకులు ఇద్దరు మృతి చెందారు.
నిజామాబాద్ : నగరంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ఇంటికి నిప్పంటుకోగా గాయపడ్డ తండ్రీకొడుకులు ఇద్దరు మృతి చెందారు. పూలాంగ్ సమీపంలోని హనుమాన్ నగర్లో.. నగరంలోని పూలాంగ్ సమీపంలోని హనుమాన్ నగరంలో గతనెల 26న తెల్లవారజామున ఫజల్‌ఖాన్ ఇంట్లో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. వెంటనే మంటలు ఇల్లంతా వ్యాపించాయి. ఈ క్రమంలో తండ్రి ఫజల్‌ఖాన్, కొడుకు షాజ్ఖాన్ ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు. ఫజల్‌ఖాన్ చికిత్స పొందుతూ మరణించగా.. షాజ్ఖాన్ను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆయన చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శుక్రవారం మృతి చెందారు. అగ్నిప్రమాద ఘటనలో తండ్రీకొడుకులు మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


