నవోదయ ప్రవేశాలకు వారం రోజులే గడువు.
నవోదయ విద్యాలయంలో ప్రవేశాలకు గడువు వారం రోజులే ఉందని ప్రిన్సిపాల్ రాంబాబు తెలిపారు.
నిజామాబాద్ :నవోదయ విద్యాలయంలో ప్రవేశాలకు గడువు వారం రోజులే ఉందని నిజాంసాగర్ విద్యాలయ ప్రిన్సిపాల్ రాంబాబు తెలిపారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. 2027–2028 విద్యాసంవత్సరానికి గాను.. 2027–2028 విద్యాసంవత్సరానికి గాను 9,11, తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి గాను ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. దీని కోసం ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ 15వతేదీ ముగుస్తున్నట్లు వివరించారు. అర్హులైన విద్యార్థులు చివరి తేదీలోపు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన కోరారు. విద్యార్థులు https://cbseitms.nic.in/2026/nvsix_9/, https://cbseitms.nic.in/2026/nvsxi_11 వెబ్‌సైట్‌లో తగిన ధ్రువపత్రాలతో దరఖాస్తులను సమర్పించాలని ఆయన పేర్కొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


