చౌటకూర్ ఆలయ ఆవరణాన్ని చదును చేసిన గ్రామ పంచాయతీ పాలకవర్గానికి సన్మానం

చౌటకూర్ ఆలయ ఆవరణాన్ని చదును చేసిన గ్రామ పంచాయతీ పాలకవర్గానికి సన్మానం

చౌటకూర్, సంగారెడ్డి : చౌటకూర్ గ్రామంలోని శ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయ ఆవరణంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మొరం పోసి చదును చేయడంతో గ్రామ పంచాయతీ పాలకవర్గాన్ని గ్రామ పెద్దలు, ఆలయ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.దేవాలయ ఆవరణంలో మొరం పోసి చదును చేయడం ద్వారా భక్తులకు, గ్రామ ప్రజలకు సౌకర్యంగా ఉండేలా చర్యలు చేపట్టినందుకు గ్రామ సర్పంచ్ పార్కల రాం రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సందీప్ గౌడ్‌తో పాటు గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులను ఈ సందర్భంగా సన్మానించారు. గ్రామంలో ప్రజలకు, ఆలయానికి అవసరమైన సౌకర్యాల కల్పనలో గ్రామ పంచాయతీ తీసుకున్న చర్యలను గ్రామ పెద్దలు అభినందించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు లక్ష్మారెడ్డి, మల్లికార్జున్ గౌడ్, ఆలయ పూజారి రామకృష్ణ పంతులు, మాజీ ఉపసర్పంచ్ రామ గౌడ్, ఉపసర్పంచ్ దమ్మీ నాగరాణి కృష్ణ, వార్డు సభ్యులు జైపాల్ రెడ్డి, బాలరాజు, చక్రపాణి, కొజ్జా లక్ష్మయ్య, అభిలాష్, మల్లికార్జున్, గండ్ల శ్రీనివాస్, రాధగౌడ్, ఎం.చెన్నయ్య పాల్గొన్నారు.

Views: 14

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఆర్యభట్ట హై స్కూల్‌లో ఘనంగా తెలంగాణ సంప్రదాయ బతుకమ్మ సంబురాలు ఆర్యభట్ట హై స్కూల్‌లో ఘనంగా తెలంగాణ సంప్రదాయ బతుకమ్మ సంబురాలు
బిచ్కుంద,  తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలను బిచ్కుంద మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని ఆర్యభట్ట హై స్కూల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా...
చౌటకూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ప్రభుత్వ వైద్యశాలలో విద్యార్థులకు మెరుగైన వైద్య విద్యను అందించాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.
ప్లాట్ పేరుతో రూ.67.20 లక్షల మోసం కేసులో మరో నిందితుడు అరెస్ట్
ఆదిలాబాద్‌లో త్వరలో 10 సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు: కలెక్టర్ రాజర్షిషా
జిల్లాలో భారీ భూ స్కాం.. ప్రోహిబిటేడ్ భూమికి రిజిస్ట్రేషన్
వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపడమే నా సంకల్పం.