చిలుముల సుహాసిని రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు
కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు బండారి గంగాధర్
శివంపేట(మెదక్): మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ చిలుముల సుహాసిని రెడ్డి జన్మదినం సందర్భంగా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని ఆమె స్వగృహంలో కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా అధికార ప్రతినిధి బండారి గంగాధర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సుహాసిని రెడ్డి ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సిరిసంపదలతో సుఖసంతోషాలతో జీవించాలని, భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు చేపట్టి ప్రజలకు సేవ చేయాలని నాయకులు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాచునూరి శ్రీశైలం యాదవ్, బీసీ సెల్ అధ్యక్షుడు కొండి దుర్గేష్, రాధాకృష్ణ గౌడ్, మన్నె వెంకటేష్, ఎద్దు మల్లేష్, గొల్లపల్లి పెద్ద నరసన్న, గొల్ల దేవేందర్ యాదవ్, ఖదీర్ పాషా తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


