వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపడమే నా సంకల్పం.
- ప్రతి ఒక్కరికీ అండగా నిలవడమే నా లక్ష్యం.
- మాజీ డిసిసిబి చైర్మన్ నిజామాబాద్ పోచారం భాస్కర్ రెడ్డి.
- కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం.
- బాన్సువాడ నియోజకవర్గం లోని అన్ని మండలాల నాయకులకు ప్రజాప్రతి నిధులకు ముఖ్య విజ్ఞప్తి.
బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఒక్క వికలాంగుని కి వారి అవసరాల కు అనుగుణం గా కృత్రిమ చేతులు, కాళ్లు ఏర్పాటు చేయించాలనే సంకల్పం తో ఈ మానవతా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం లో భాగంగా గత నెల సెప్టెంబర్ 30 వ తేదీన బాన్సువాడ పట్టణ కేంద్రం లో ముగ్గురి కి కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ సేవా కార్యక్రమాన్ని నియోజకవర్గం లోని ప్రతి గ్రామానికి విస్తరించి, అవసరమైన ప్రతి ఒక్కరికీ సహాయం అందించాలన్నదే నా లక్ష్యం. ఈ సందర్భం గా బాన్సువాడ నియోజకవర్గం లోని అన్ని మండలాల నాయకులకు, ప్రజాప్రతి నిధులకు నా ముఖ్య విజ్ఞప్తి అన్నారు. దయ చేసి మీ మీ గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్క వికలాంగుడి ఇంటికి వెళ్లి, వారి పూర్తి వివరాలు, ఫోన్ నంబర్, అంగవైకల్యానికి గల కారణం, వారికి అవసరమైన సహాయక పరికరాల వివరాలను సేకరించి నాకు అందించండి సూచించారు. దసరా పండుగ అనంతరం మండలా ల వారీగా ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నాం. ఈ క్యాంపుల నిర్వహణ లో మీ సహకారం ఎంతో అవసరం. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే.. మీ గ్రామాల్లోని అంగవైకల్యం ఉన్న ప్రతి ఒక్కరినీ గుర్తించి, వారికి సమాచారం అందించి, క్యాంపు ల వరకు తీసుకురావాలి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కృత్రిమ అవయవాల ను పొందలేక ఇబ్బందులు పడుతున్న వారికి అండగా నిలబడి, వారు ఆత్మవిశ్వాసం తో తమ జీవితాలను కొనసాగించేలా చేయూత నివ్వడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం అని తెలిపారు . మన చిన్న ప్రయత్నం ఒకరి జీవితంలో గొప్ప మార్పుకు నాంది కావచ్చు. ఒక్కరు కూడా ఈ సహాయాని కి దూరం కాకూడదు. ప్రతి అర్హుడి కీ సహాయం అందేలా మన మంతా సమష్టి గా కృషి చేద్దాం కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


