గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ & వర్కర్స్ పర్మినెంట్ చేయాలి
ఎంపీ ఓ శ్రీనివాస్ కు వినతిపత్రం సమర్పించిన పారిశుద్ధ కార్మికులు
గంభీరావుపేట :గ్రామ పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలి. రెండవ పి ఆర్ సి లో చేర్చాలి. కనీస వేతనం 30,000/- లుగా నిర్ణయించాలి. అని గంభీరావుపేట మండల పారిశుద్ధ కార్మికులు శుక్రవారం ఎంపీ ఓ శ్రీనివాస్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ కార్మికులు మాట్లాడుతూ, మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి అని డిమాండ్ చేస్తూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ 2026 అక్టోబర్ 26న చలో హైదరాబాద్ కి పిలుపు ఇచ్చారు. ఈ పిలుపులో భాగస్వామ్యం కావడానికి అనుమతి ఇవ్వాలని.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 56,000 వేలమంది కార్మికులు పని చేస్తున్నారు. కార్మికులకు ఎలాంటి రక్షణ పరికరాలు అందించడం లేదు. నిత్యం మురికి కాలువలలో పని చేస్తున్న కార్మికులకు ఎలాంటి వైద్య సేవలు అందడం లేదు.కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టగానే గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు పెంచి పర్మినెంట్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మల్టీపర్సస్ విధానం రద్దు చేసి పాత కేటగిరీలు కొనసాగించాలని, కనీస వేతనం 30,000/- చెల్లించాలని, హెల్త్ కార్డులు అందించాలని తదితర డిమాండ్లతో 2026 అక్టోబర్ 26 న చలో హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొంటున్నాం అని తెలిపారు. కావున తమరు అనుమతించాలని కోరుచున్నాం. అక్కల అంజా గౌడ్, బరిగల బిక్షపతి, నాందేడ్ రవి, శనిగరపు నరసింహులు, బుదయ్య, మొలుగూరి ఎల్లవ్వ, ఈరిగి నవీన్, గ్యార కృష్ణ, బరిగెల సాయిలు తో పాటు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


