రైస్ మిల్లులో 4,876 టన్నుల ధాన్యం మాయం... నాగర్ కర్నూల్ లో భారీ కుంభకోణం

రైస్ మిల్లులో 4,876 టన్నుల ధాన్యం మాయం... నాగర్ కర్నూల్ లో భారీ కుంభకోణం

నాగర్‌కర్నూల్ :  నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రభుత్వ ధాన్యం మళ్లింపు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కల్వకుర్తి మండలం తర్నికల్‌లోని శ్రీ రాఘవేంద్ర ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో గురువారం రాత్రి పౌరసరఫరాలు, విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 4,876 టన్నుల ప్రభుత్వ ధాన్యం కొరత ఉన్నట్లు గుర్తించారు. కొరతగా గుర్తించిన ధాన్యం విలువ సుమారు రూ.14.26 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగంపై అధికారులు ఫిర్యాదు చేయగా, మిల్లు నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ధాన్యం మళ్లింపు వ్యవహారంపై అధికారులు విచారణ జరుపుతున్నారు.

Views: 16

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News