బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలకు నిధుల విడుదలపై హర్షం

బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలకు నిధుల విడుదలపై హర్షం

నిజామాబాద్ : హైదరాబాద్​లో బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం నిధుల విడుదలపై హర్షం వ్యక్తం చేస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్​ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నగరంలోని కేర్​ డిగ్రీ కళాశాలలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
ప్రతి బీసీ కులానికి రూ.5 కోట్ల చొప్పున.. ప్రతిఒక్క బీసీ కులానికి రూ.5కోట్ల చొప్పున దాదాపు రూ.88 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్​రెడ్డి కి, పీసీసీ చీఫ్​ బొమ్మ మహేష్​కుమార్​ గౌడ్​కు బీసీ సంక్షేమ సంఘం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు నరాల సుధాకర్​ తెలిపారు. హైదరాబాద్ మహానగరంలో బీసీల కోసం ఒక ఆత్మ గౌరవ భవనం ఏర్పాటు అనేది బీసీలందరూ గర్వంచదగ్గ విషయమన్నారు. బీసీలకు ప్రభుత్వాలు ఎల్లవేళలా వెన్నుదన్నుగా నిలువాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు కొయ్యాడ శంకర్, సాయి బసవ, పోతుగంటి గంగాధర్, దేశాయి గంగాధర్, సత్యనారాయణ, హన్మాండ్లు పాల్గొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News