పీఆర్సీ నివేదిక తెప్పించి 60 శాతం ఫిట్‌మెంట్‌తో వెంటనే అమలు చేయాలి
టిఆర్టీఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బుర్ర కృష్ణ ప్రసాద్ గౌడ్, బోయన్నగారి నారాయణ
తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టిఆర్టీఎఫ్) : గంభీరావుపేట మండల శాఖ ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని వివిధ పాఠశాలల్లో టిఆర్టీఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన టిఆర్టీఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు బుర్ర కృష్ణ ప్రసాద్ గౌడ్, ప్రధాన కార్యదర్శి బోయన్నగారి నారాయణ మాట్లాడుతూ.. పీఆర్సీ గడువు ముగిసి మూడు సంవత్సరాలు గడిచినా ఇప్పటివరకు నివేదిక తెప్పించుకోకపోవడం విచారకరమన్నారు.
ప్రభుత్వం వెంటనే పీఆర్సీ నివేదికను తెప్పించి, 60 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు రావాల్సిన పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని కోరారు. అలాగే, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధ్యాయుల వర్క్ అడ్జస్ట్మెంట్‌లో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన డిప్యూటేషన్లను వెంటనే సరిచేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ముత్తయ్యగారి నాగరాజు, మండల ప్రధాన కార్యదర్శి చిట్టంపల్లి బాలకిషన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గద్యడపు శ్రీనివాస్, శనిగరం రామచంద్రం, శనిగరం బాలరాజు, పునరావుపేట మండల అధ్యక్షులు గాజేంగి విష్ణు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

