తూప్రాన్ గర్ల్స్ హైస్కూల్‌లో స్వీయ రక్షణ అవగాహన కార్యక్రమం

స్వీయ రక్షణ మెళకువలపై విద్యార్థినులకు శిక్షణ అమ్మాయిలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి బాలికలకు కరాటేలో శిక్షణ.. ఆత్మరక్షణపై అవగాహన వ్యక్తిగత భద్రతపై అవగాహన కలిగి ఉండాలి

తూప్రాన్ గర్ల్స్ హైస్కూల్‌లో స్వీయ రక్షణ అవగాహన కార్యక్రమం

తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ మెదక్, విద్యార్థినులు తమ వ్యక్తిగత భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఆపద సమయంలో ధైర్యంగా వ్యవహరిస్తూ ఆత్మరక్షణ పద్ధతులను ఉపయోగించుకోవాలని తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ సూచించారు. గురువారం తూప్రాన్ గర్ల్స్ హైస్కూల్‌లో నిర్వహించిన స్వీయ రక్షణ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ మాట్లాడుతూ... విద్యార్థినులు చిన్నప్పటి నుంచే ఆత్మరక్షణ విద్యను నేర్చుకోవాలని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. వ్యక్తిగత భద్రత పట్ల అవగాహన కలిగి ఉండటంతో పాటు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని తెలిపారు. అవసరమైన సమయంలో పోలీసుల సహాయం తీసుకోవాలని, మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ నిరంతరం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం కరాటే మాస్టర్లు విద్యార్థినులకు వివిధ స్వీయ రక్షణ మెళకువలను ప్రదర్శించి, వాటిని ఆచరణలో ఎలా ఉపయోగించుకోవాలో వివరించారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ ఎంఈఓ, తూప్రాన్ ఎస్ఐ జ్యోతి, షీ టీమ్ సభ్యులు, పోలీస్ సిబ్బంది, కరాటే మాస్టర్లు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

Views: 11

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సిద్దిపేటలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటన.. సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన సిద్దిపేటలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటన.. సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన
సిద్దిపేటలో :- రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. ఈ నెల 19న (గురువారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలో...
సీఎం సభకు ప్రజలు భారీగా తరలిరావాలి: నీలం మధు ముదిరాజ్
పేద కుటుంబానికి అండగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
చౌటకూర్‌లో రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
గుడుంబా తయారీ స్థావరాలపై పోలీసుల దాడులు.. ఆరుగురిపై కేసులు నమోదు
ప్రశాంతంగా కొనసాగుతున్న కొనసాగుతున్న తె. యూ. డిగ్రీ ( V & VII ) సెమిస్టర్ పరీక్షలు
వివో భవన నిర్మాణ పనులు ప్రారంభం