సాలూరలో 96 మందికి చేయూత పింఛన్ పత్రాల పంపిణీ

సాలూరలో 96 మందికి చేయూత పింఛన్ పత్రాల పంపిణీ

సాలూర మండల కేంద్రంలో నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ పత్రాలను బుధవారం గ్రామ సర్పంచ్ సొక్కం లావణ్య రవి, సొసైటీ చైర్‌పర్సన్ అల్లె రమేష్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అల్లే రమేష్ మాట్లాడుతూ గ్రామంలో వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు కలిపి మొత్తం 96 పింఛన్లు మంజూరైనట్లు తెలిపారు. అర్హులైన పేదలకు సామాజిక భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పింఛన్లు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డికి గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా వార్డు సభ్యులు, ఇల్తేపు శంకర్ సార్, అల్లె జనార్దన్, రాజ్ పటేల్, శివకాంత్ పటేల్, గ్రామ కార్యదర్శి ప్రవీణ్, లబ్ధిదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Views: 40

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సిద్దిపేటలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటన.. సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన సిద్దిపేటలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటన.. సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన
సిద్దిపేటలో :- రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. ఈ నెల 19న (గురువారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలో...
సీఎం సభకు ప్రజలు భారీగా తరలిరావాలి: నీలం మధు ముదిరాజ్
పేద కుటుంబానికి అండగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
చౌటకూర్‌లో రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
గుడుంబా తయారీ స్థావరాలపై పోలీసుల దాడులు.. ఆరుగురిపై కేసులు నమోదు
ప్రశాంతంగా కొనసాగుతున్న కొనసాగుతున్న తె. యూ. డిగ్రీ ( V & VII ) సెమిస్టర్ పరీక్షలు
వివో భవన నిర్మాణ పనులు ప్రారంభం