శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ (AITUC) నిరాహార దీక్షలు
నస్పూర్ (మంచిర్యాల), : సింగరేణి కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ (AITUC) ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ దీక్షలను సీపీఐ (CPI) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేని శంకర్ ప్రారంభించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సింగరేణి యాజమాన్యం కార్మికుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కార్మికుల ఆరోగ్య భద్రత దృష్ట్యా తక్షణమే మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా, చీఫ్ లేబర్ కమిషనర్ (CLC) సమక్షంలో గతంలో ఒప్పందం చేసుకున్న 24 ప్రధాన డిమాండ్లను ఏమాత్రం జాప్యం చేయకుండా వెంటనే అమలు చేయాలని కోరారు. కార్మికుల హక్కుల సాధన కోసమే ఈ నిరాహార దీక్షలకు పూనుకున్నామని, యాజమాన్యం స్పందించకుంటే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


