కేసిఆర్ తోనే అభివృద్ధి సాధ్యం

అవ్వకు ఆసరా.. బిడ్డకు భరోసా – పేదల సంక్షేమమే కేసీఆర్ పాలన లక్ష్యం పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదే బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

కేసిఆర్ తోనే అభివృద్ధి సాధ్యం

పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదే  :

 బోథ్ ఎమ్మెల్యే  అనిల్ జాదవ్

,ఆదిలాబాద్ డెస్క్ : కేసిఆర్ తోనే అభివృద్ధి సాధ్యం అని బోథ్ శాసన సభ్యులు అనిల్ జాదవ్ అన్నారు సోనాల మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ఆసరా పెన్షన్ పత్రాలు మరియు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే  అనిల్ జాదవ్  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు
ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ పత్రాలు, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేసిన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సాధకుడు. కేసీఆర్ అని అన్నారు అలాగే పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఆత్మగౌరవంతో జీవించాలనే గొప్ప సంకల్పంతో ఆసరా పెన్షన్ పథకాన్ని అమలు చేసి లక్షలాది కుటుంబాలకు అండగా నిలిచారని కొనియాడారు.
గతంలో అతి తక్కువగా ఉన్న పెన్షన్ మొత్తాన్ని రూ.2,000కు పెంచి వృద్ధులకు, వితంతువులకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు దివ్యాంగులకు రూ.3,016 పెన్షన్ అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత కేసీఆర్ గారికే దక్కుతుందని అన్నారు ఒకవైపు అవ్వాతాతలకు ఆసరాగా నిలుస్తూ, మరోవైపు దివ్యాంగులకు ఆర్థిక చేయూత అందించడం కేసీఆర్ గారి మానవతా దృక్పథానికి నిదర్శనమని పేర్కొన్నారు అదేవిధంగా పేదింటి ఆడబిడ్డల వివాహాలు తల్లిదండ్రులకు ఆర్థిక భారంగా మారకూడదనే గొప్ప ఆలోచనతో కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి ఒక్కో ఆడబిడ్డ వివాహానికి రూ.1,00,116 ఆర్థిక సహాయం అందించిన ఘనత కూడా కేసీఆర్ గారిదేనని తెలిపారు. పేద కుటుంబాల్లో ఆడబిడ్డల పెళ్లిళ్లకు అండగా నిలిచి, వారి తల్లిదండ్రుల కష్టాలను తగ్గించిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు.
కేసీఆర్ పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కేవలం పథకాలుగా కాకుండా పేద ప్రజల జీవితాల్లో భరోసాగా నిలిచాయని, రైతులు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేదల సంక్షేమం కోసం అనేక వినూత్న కార్యక్రమాలను అమలు చేశారని గుర్తు చేశారు మరియు అవ్వకు ఆసరా.. ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి.. పేద కుటుంబానికి ఆర్థిక భరోసా.. ఇదే కేసీఆర్ సంక్షేమ పాలనకు నిదర్శనం అని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు పేద ప్రజల సంక్షేమం, ఆత్మగౌరవం, అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయం చైర్మన్ మల్లెపూల నర్సారెడ్డి,స్థానిక  సర్పంచ్ బిందుజా సుధీర్ రెడ్డి,ఆత్మ చైర్మన్ గొర్ల రాజు యాదవ్,సొసైటీ డైరెక్టర్ లోలపు పోశెట్టి మరియు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ఆయా పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Views: 60

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సిద్దిపేటలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటన.. సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన సిద్దిపేటలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటన.. సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన
సిద్దిపేటలో :- రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. ఈ నెల 19న (గురువారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలో...
సీఎం సభకు ప్రజలు భారీగా తరలిరావాలి: నీలం మధు ముదిరాజ్
పేద కుటుంబానికి అండగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
చౌటకూర్‌లో రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
గుడుంబా తయారీ స్థావరాలపై పోలీసుల దాడులు.. ఆరుగురిపై కేసులు నమోదు
ప్రశాంతంగా కొనసాగుతున్న కొనసాగుతున్న తె. యూ. డిగ్రీ ( V & VII ) సెమిస్టర్ పరీక్షలు
వివో భవన నిర్మాణ పనులు ప్రారంభం