కేటీ ఆర్ అనుకొనే సిరిసిల్ల కంచుకోట మంచుకోట అయ్యింది

కే టీ ఆర్ దోపిడీ బండారం బట్టబయలు గడ్డం పెంచుకొని కే టీ ఆర్ యాత్ర చేస్తే ప్రజలు నమ్మరు సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కే కే మహేందర్ రెడ్డి

కేటీ ఆర్ అనుకొనే సిరిసిల్ల కంచుకోట మంచుకోట అయ్యింది

గంభీరావుపేట  : కే టీ ఆర్ తను అనుకుంటున్న సిరిసిల్ల కంచుకోట మంచుకోట అయిందని అతను అధికారం లో ఉన్నప్పుడు ప్రజల సొమ్ము దోచుకొని దాచుకున్నారని కాంగ్రేస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జి కే కే మహేందర్ రెడ్డి అన్నారు,బుధవారం రోజున గంభీరావు పేట మండలం కొత్తపల్లి, కోళ్లమద్ది, లింగన్నపేట గ్రామాలలో పలు కార్యక్రమాలాల్లో కే కే మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు, మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటే లక్ష్యం గా విద్యార్థులు ఆత్మ త్యాగం చేసుకున్నారని వారి ఆశయాలకు అనుగుణంగా లక్ష ల ఉద్యోగ నియామకాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందన్నారు, మహిళలకు వడ్డీ లేని పది లక్షల వరకు రుణాలను ఇస్తూ వివిధ వ్యాపారాల లో ప్రాధాన్యత ఇస్తూ కోటి మంది మహిళలను కొటేశ్వర్లను చేసే ఆలోచన సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారన్నారు, హాస్టల్ చార్జెస్ పెంచి విద్యార్థులకు నాన్యమైన విద్య అందిస్తున్నామని అన్నారు, చరిత్ర లో నిలిచిపోయే ఇందిరమ్మ కుటుంబ భీమా పథకం ఈ ప్రభుత్వం రేపు ప్రకటిస్తున్నదని మహేందర్ రెడ్డి అన్నారు, గత పది సంవత్సరాల అధికారం లో కే టీ ఆర్ సిరిసిల్ల జిల్లాలో తన అనుచరులకు తొమ్మిది వేయిల ఎకరాల ప్రభుత్వ భూమినీ అన్యాక్రాంతం చేసి అప్పచెప్పాడని అంత కంటే ఎక్కువ సిరిసిల్ల కు కే టీ ఆర్ ఒరగబెట్టింది ఏమీ లేదని మహేందర్ రెడ్డి ఆరోపించారు, కే టీ ఆర్ గడ్డం పెంచుకొని ఏ యాత్ర చేసినా ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరన్నారు, కే టీ ఆర్ గతం లో నేనే మంత్రి, ముఖ్యమంత్రినీ అని చెప్పుకొని ఈ ప్రాంత 9 వ ప్యాకేజి పనులు పండబెట్టి డ్రగ్స్, ఇసుక, బట్టల మాఫియాలను కే టీ ఆర్ ప్రోత్సహించారన్నారు , సిరిసిల్ల బహిరంగ సభలో కే టీ ఆర్ బాగోతాన్ని సీఎం రేవంత్ రెడ్డి బట్ట బయలు చేసాడని అందుకు ఆధారాలుగా ఆ కుటుంబo అక్రమంగా సంపాధించిన కు సంబంధించిన జన్వాడా, ఎర్రవెల్లి, రంగనాయక, హిమాయత్ సాగర్, దక్కన్ సరాయు ఫైవ్ స్టార్ హోటల్సే నిదర్శనం అని మహేందర్ రెడ్డి అన్నారు, రేపటి సిద్దిపేట సీఎం రేవంత్ రెడ్డి సభలో హరీష్ రావు బాగోతం బట్ట బయలు అవుతున్నదని ఈ ప్రాంతం నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్లి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు, ఇంకా కే టీ ఆర్ మోచేతి నీళ్లకు ఆశపడి ఉంటారా లేదా ఈ ప్రాంత అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ తో కలిసివాస్తారా అని బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు తేల్చుకోవాలని మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో ఏ ఎం సీ చైర్మన్ హామీద్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పర్శ హన్మాండ్లు, పాక్స్ చైర్మన్ వెంకటి నాయకులు మేడ భాస్కర్, అజ్మీరా భాస్కర్ నాయక్, గోపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాయనర్సు, రాజారాంరెడ్డి, కిషన్,రాజం, అంజగౌడ్, రవి, రాజు,లక్సమన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సిద్దిపేటలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటన.. సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన సిద్దిపేటలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటన.. సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన
సిద్దిపేటలో :- రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. ఈ నెల 19న (గురువారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలో...
సీఎం సభకు ప్రజలు భారీగా తరలిరావాలి: నీలం మధు ముదిరాజ్
పేద కుటుంబానికి అండగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
చౌటకూర్‌లో రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
గుడుంబా తయారీ స్థావరాలపై పోలీసుల దాడులు.. ఆరుగురిపై కేసులు నమోదు
ప్రశాంతంగా కొనసాగుతున్న కొనసాగుతున్న తె. యూ. డిగ్రీ ( V & VII ) సెమిస్టర్ పరీక్షలు
వివో భవన నిర్మాణ పనులు ప్రారంభం