నాగర్‌కర్నూల్‌లో ప్రభుత్వ బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలి మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి వినతి
నాగర్‌కర్నూల్ : నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని బీసీ విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన పోటీ పరీక్షల శిక్షణ అందించాలని విజ్ఞప్తి చేశారు. టీజీపీఎస్సీ గ్రూప్స్, పోలీస్, డీఎస్సీ, టెట్, ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, బ్యాంకింగ్ పరీక్షలకు శిక్షణ అందించాలని కోరారు. ప్రభుత్వ కోచింగ్ కేంద్రం లేక పేద విద్యార్థులు హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్టడీ సర్కిల్ ఏర్పాటుకు జిల్లా కార్యాలయాల సముదాయంలో 4,000 చదరపు అడుగుల ప్రభుత్వ భవనాన్ని గుర్తించినట్లు తెలిపారు. ఆ భవనంలో రెండు స్టడీ హాళ్లు, నాలుగు గదులు, మరుగుదొడ్లు, నీరు, విద్యుత్, ఇంటర్నెట్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. శాశ్వత భవనం నిర్మించే వరకు గుర్తించిన భవనంలో తాత్కాలికంగా తరగతులు ప్రారంభించాలని సూచించారు. బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటుకు తక్షణ అనుమతులు, నిధులు, బోధనా సిబ్బంది మంజూరు చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.ప్రభుత్వ నిర్ణయంతో గ్రామీణ ప్రాంత పేద, మధ్యతరగతి బీసీ విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మెరుగైన అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


