పేద కుటుంబానికి అండగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
వెన్నెముక చికిత్స కోసం మహమ్మద్ ఖాజాకు రూ.2 లక్షల LOC మంజూరు
నిజామాబాద్ : బాల్కొండ మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ ఖాజా వెన్నెముక సంబంధిత అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన వైద్య చికిత్స నిమిత్తం మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి రూ.2 లక్షల LOC (లెటర్ ఆఫ్ క్రెడిట్) మంజూరు చేయించారు. ఈ మేరకు ఈ రోజు హైదరాబాద్‌లోని తన నివాసంలో మహమ్మద్ ఖాజా కుటుంబ సభ్యులకు LOC మంజూరు పత్రం కాపీని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా మహమ్మద్ ఖాజా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తమలాంటి పేద కుటుంబానికి వైద్య చికిత్స కోసం రూ.2 లక్షల LOC మంజూరు చేయించి అండగా నిలిచిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


