స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ శిబిరాన్ని సందర్శించిన భూపాలపల్లి సీఐ చెన్నూరి శ్రీనివాస్.
భూపాలపల్లి : భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ – సింగరేణి కాలరీస్ జిల్లా అసోసియేషన్, భూపాలపల్లి ఏరియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మూడు రోజుల పయోనీరింగ్ అండ్ క్యాంప్ క్రాఫ్ట్ ట్రైనింగ్ శిబిరాన్ని భూపాలపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ చెన్నూరి శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులతో సీఐ మాట్లాడి, వారికి పలు విలువైన సూచనలు చేశారు. విద్యార్థులు చిన్న వయస్సు నుంచే క్రమశిక్షణ, సమయపాలన, సేవాభావం, నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని సూచించారు. స్కౌటింగ్ ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, ధైర్యసాహసాలు, సామాజిక బాధ్యత పెంపొందుతాయని పేర్కొన్నారు. చదువుతో పాటు సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలని, ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం, పరిసరాల పరిశుభ్రతను పాటించడం, ప్రకృతిని పరిరక్షించడం వంటి మంచి అలవాట్లను పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. శిక్షణలో నేర్చుకున్న నైపుణ్యాలను తమ జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా శిక్షణ శిబిరంలో విద్యార్థులు ప్రదర్శించిన పయోనీరింగ్ నైపుణ్యాలు, క్యాంప్ క్రాఫ్ట్ కార్యక్రమాలను పరిశీలించి అభినందించారు.భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఎ. రాజేశ్వర్ రెడ్డి సహకారంతో స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ స్కౌట్ డెన్‌ను పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంచేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు ఏరియా యాజమాన్యం అందిస్తున్న ప్రోత్సాహం అభినందనీయమని తెలిపారు.నవంబర్ 17 నుంచి 19వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ శిక్షణ శిబిరంలో సుమారు 100 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓసినలుసాయినిరంజన్,సుధాకర్,లీడర్ ఆఫ్ ధ కోర్స్ శక్తికుమార్,శ్రీనివాస రావు,స్వామి రాజమౌళి,రమేశ్,సరిత, లక్ష్మి గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


