కూచిపూడి నృత్య ప్రదర్శనలో ధన్వాడ వాసికి ప్రథమ బహుమతి

.....కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో ప్రతిభ చాటిన దండిగి అనురాధ ....గ్రామస్తుల అభినందనలు....

కూచిపూడి నృత్య ప్రదర్శనలో ధన్వాడ వాసికి ప్రథమ బహుమతి

నారాయణపేట :  నారాయణపేట జిల్లా ధన్వాడ గ్రామానికి చెందిన దండిగి రాము సతీమణి దండిగి అనురాధ కూచిపూడి నృత్య ప్రదర్శనలో తన ప్రతిభను చాటుతూ ప్రథమ బహుమతి సాధించారు. కాశీలోని విశ్వేశ్వరుని సన్నిధిలో కాసి విశ్వేశ్వరునికి నిత్యంజలి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కూచిపూడి నృత్య ప్రదర్శనలో ఆమె పాల్గొన్నారు. తన సొంత సంస్థ అయిన శ్రీ సాయిశ్వర్ ఆర్ట్స్ అకాడమీ తరఫున ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనురాధ అద్భుతమైన నృత్య ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పలువురు శాస్త్రీయ నృత్య కళాకారిణులు ఈ కార్యక్రమానికి హాజరై తమ కళా ప్రతిభను ప్రదర్శించారు. వారితో పోటీపడి అనురాధ ప్రథమ బహుమతి సాధించడం విశేషంగా నిలిచింది. కూచిపూడి నృత్యంపై ఆమెకున్న ఆసక్తి, సాధన, అంకితభావం ఈ విజయానికి కారణమని పలువురు అభిప్రాయపడ్డారు. ధన్వాడ గ్రామానికి చెందిన మహిళ జాతీయ స్థాయి వేదికపై తన ప్రతిభను చాటుతూ ప్రథమ బహుమతి సాధించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. అనురాధను అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సిద్దిపేటలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటన.. సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన సిద్దిపేటలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటన.. సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన
సిద్దిపేటలో :- రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. ఈ నెల 19న (గురువారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలో...
సీఎం సభకు ప్రజలు భారీగా తరలిరావాలి: నీలం మధు ముదిరాజ్
పేద కుటుంబానికి అండగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
చౌటకూర్‌లో రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
గుడుంబా తయారీ స్థావరాలపై పోలీసుల దాడులు.. ఆరుగురిపై కేసులు నమోదు
ప్రశాంతంగా కొనసాగుతున్న కొనసాగుతున్న తె. యూ. డిగ్రీ ( V & VII ) సెమిస్టర్ పరీక్షలు
వివో భవన నిర్మాణ పనులు ప్రారంభం