భారత్ సమ్మిట్ పేరుతో దేశ గౌరవాన్ని కించపరిచే ప్రయత్నం
కాంగ్రెస్ వైఖరిని తీవ్రంగా ఖండించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్ గౌడ్
మెదక్, : రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి సమక్షంలో విదేశీ రాజకీయ నాయకుడితో భారత ప్రధాని, దేశ ప్రజాస్వామ్యంపై రాజకీయ నినాదాలు చేయించడం సిగ్గుచేటు అని జిల్లా బీజేపీ అధ్యక్షులు వెళ్దాస్ మల్లేష్ గౌడ్ ద్వాజమెత్తరు.
హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారత్ సమ్మిట్ సందర్భంగా యూరోపియన్ సోషలిస్ట్ పార్టీ (Party of European Socialists) సెక్రటరీ జనరల్ జియాకోమో ఫిలిబెక్ (Giacomo Filibeck) భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని, భారత ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రశ్నిస్తూ 'వోట్ చోర్, గద్దీ ఛోడ్' అంటూ రాజకీయ నినాదాలు చేయడాన్ని భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా శాఖ తీవ్రంగా ఖండించింది.
ఈ నేపథ్యంలో బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు మెదక్ జిల్లా ఎస్పీని కలిసి విదేశీ రాజకీయ నాయకుడు భారతదేశ అంతర్గత రాజకీయ వ్యవహారాలపై చేసిన వ్యాఖ్యలపై తగిన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం (మెమోరాండం) అందజేశారు.
అనంతరం మెదక్ శివాజీ చౌక్ వద్ద జియాకొమో ఫెలోబిక్ చిత్రపటాన్ని దహనం చేయడం జరిగింది
ఈ సందర్భంగా బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షులు వాళ్దాస్ మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ...
భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నికల ద్వారా ఏర్పడిన ప్రభుత్వాన్ని, ప్రజలు ఎన్నుకున్న ప్రధానమంత్రిని ఒక విదేశీ రాజకీయ పార్టీ నాయకుడు భారత గడ్డపై నిలబడి రాజకీయ నినాదాలతో విమర్శించడం ఎంతమాత్రం సమర్థనీయం కాదు.
ప్రజాస్వామ్యంపై మాట్లాడే నైతిక హక్కు ఎవరికైనా ఉండవచ్చు. కానీ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను, ఎన్నికల ప్రక్రియను, ప్రజల తీర్పును అవమానించే విధంగా విదేశీ రాజకీయ నాయకులు వ్యాఖ్యలు చేయడం సరికాదు.
ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో జియాకోమో ఫిలిబెక్ 'వోట్ చోర్, గద్దీ ఛోడ్' అంటూ నినాదాలు చేయడం, ఆ సమయంలో వారిద్దరూ నవ్వుతూ చప్పట్లు కొడుతూ స్పందించడం దేశ ప్రజాస్వామ్య గౌరవానికి సంబంధించిన తీవ్రమైన అంశం.
ఒకవైపు భారతదేశ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూనే, మరోవైపు విదేశీ రాజకీయ నాయకులతో మన దేశ అంతర్గత రాజకీయాలపై వ్యాఖ్యలు చేయించడం కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరికి నిదర్శనం.
రాహుల్ గాంధీ గారికి కొన్ని ప్రశ్నలు:
భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై విదేశీ రాజకీయ నాయకులు వ్యాఖ్యలు చేయడానికి వేదిక కల్పించడం వెనుక ఉద్దేశం ఏమిటి?
భారతదేశంలో ప్రజలు ఎన్నుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిపై విదేశీ నాయకుడు రాజకీయ నినాదాలు చేస్తుంటే మీరు నవ్వుతూ చప్పట్లు కొట్టడం ఏ విధమైన రాజకీయ సంస్కృతి?
దేశ ఎన్నికల వ్యవస్థపై మీకు అభ్యంతరాలు ఉంటే భారత రాజ్యాంగం కల్పించిన న్యాయపరమైన, ప్రజాస్వామ్య మార్గాలు ఉండగా విదేశీ నాయకుల మద్దతు ఎందుకు కోరుతున్నారు?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి, పెట్టుబడులు, ప్రజా సమస్యలపై చర్చించాల్సిన వేదికను జాతీయ రాజకీయ విమర్శలకు ఎందుకు ఉపయోగించుకున్నారు?
రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరి ఏమిటి?
తెలంగాణ రాష్ట్ర ప్రజల పన్నుల ద్వారా నిర్వహించే కార్యక్రమాలు దేశ ప్రతిష్టను పెంచే విధంగా ఉండాలి. అంతర్జాతీయ ప్రతినిధులను ఆహ్వానించినప్పుడు భారతదేశ గౌరవం, ప్రజాస్వామ్య విలువలు, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. కానీ భారత్ సమ్మిట్ వేదికపై జరిగిన పరిణామాలు అనేక సందేహాలకు తావిస్తున్నాయి.
భారతదేశానికి సంబంధించిన రాజకీయ అంశాలపై విదేశీ నాయకులు వ్యాఖ్యానించడానికి వేదిక కల్పించడం, అలాంటి వ్యాఖ్యలకు కాంగ్రెస్ అగ్రనాయకత్వం మద్దతుగా స్పందించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని బీజేపీ నాయకులు పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పై వ్యక్తిగత రాజకీయ విమర్శలు చేయడం కాంగ్రెస్ పార్టీ రాజకీయ అంశం కావచ్చు. కానీ దేశ ప్రజలు ఎన్నుకున్న నాయకుడిని, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను విదేశీ వేదికలపై కించపరిచే ప్రయత్నాలను భారతీయ జనతా పార్టీ సహించబోదని స్పష్టం చేశారు.
భారతదేశ ప్రజాస్వామ్యం ఏ ఒక్క రాజకీయ పార్టీకి, ఏ ఒక్క నాయకుడికి సంబంధించినది కాదు. అది 140 కోట్ల భారతీయుల హక్కు, గౌరవం, ఆత్మగౌరవానికి ప్రతీక. దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ రాజకీయ జోక్యాన్ని ప్రోత్సహించే విధానాలను కాంగ్రెస్ పార్టీ విడనాడాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.
ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు చట్టపరంగా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని మెదక్ జిల్లా ఎస్పీ గారికి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మెదక్ జిల్లా మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, మెదక్ జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి ఈర్ల రంజిత్ రెడ్డి, బిజెపి స్టేట్ కౌన్సిల్ మెంబర్ రాగి రాములు, కిసాన్ మోర్చా మెదక్ జిల్లా అధ్యక్షుడు బైండ్ల సత్యనారాయణ ఓబీసీ మోర్చా మెదక్ జిల్లా అధ్యక్షుడు వడ్ల జనార్ధన్ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పట్లోళ్ల మల్లిక బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు శైలజ పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్,mln రెడ్డి,మైనార్టీ మోర్చా అధ్యక్షుడు డ్యాన్సింగ్ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బాల్రాజ్ రామంపేట మండల అధ్యక్షుడు సర్పంచ్ నవీన్ మెదక్ రూరల్ మండల అధ్యక్షులు సర్పంచ్ బెండవీన పట్టణ కౌన్సిలర్లు ఇప్ప అఖిలభారత్ పబ్బ రాజమణి లక్ష్మణ్ మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు శంకర్ గౌడ్, మెదక్ జిల్లా కార్యదర్శి కల్కి నాగరాజు అల్లం మధు లోకబోయిన లోకేష్ అంకం శ్రీనివాస్, మంజుల, పాపన్నపేట మండల అధ్యక్షుడు వడ్ల సంతోష్ చారి, రామ్ పేట టౌన్ ప్రెసిడెంట్ అవినాష్ రెడ్డి, నిజాంపేట మండల అధ్యక్షుడు సిద్ధిరామిరెడ్డి, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లల విజయ్, బీజేవైఎం నాయకులు సాయిబాబా సన్నీ దినేష్, ఆంజనేయులు, లక్ష్మణ్ తో పాటు పార్టీ జిల్లా నాయకులు, వివిధ మోర్చాల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


