పాలసీదారుల నమ్మకమే ఏజెంట్ల విజయానికి సోపానం

క్రమశిక్షణతో పనిచేస్తే బీమా రంగంలో అద్భుత ప్రగతి నల్గొండ డెవలప్మెంట్ ఆఫీసర్ ముక్కపాటి శ్రీనివాస్ మాల్‌లో బీఎంఎస్ ఆధ్వర్యంలో మెగా ఎడ్యుకేషన్ సెమినార్

పాలసీదారుల నమ్మకమే ఏజెంట్ల విజయానికి సోపానం

నల్గొండ/చింతపల్లి : బీమా రంగంలో రాణించాలంటే క్రమశిక్షణతో పాటు పాలసీదారులతో నిరంతరం సత్సంబంధాలు కొనసాగించడం ఎంతో అవసరమని నల్గొండ బ్రాంచ్-1 డెవలప్‌మెంట్ ఆఫీసర్ ముక్కపాటి శ్రీనివాస్ పేర్కొన్నారు. భారతీయ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ సంఘం, భారతీయ మజ్దూర్ సంఘ్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం మాల్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఎల్‌ఐసీ ఏజెంట్ల కోసం 'మెగా ఎడ్యుకేషన్ సెమినార్' నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవరకొండ బ్రాంచ్ మేనేజర్ ఆర్.శివకృష్ణ, విశిష్ట అతిథిగా మాల్ శాటిలైట్ ఆఫీస్ బీఎం ఎన్.అరుణ్ నాయక్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రధాన వక్త ముక్కపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎల్‌ఐసీ ప్రవేశపెట్టిన నూతన పాలసీల విశిష్టతను, వాటిని ప్రజల్లోకి సులభంగా తీసుకెళ్లే మెళకువలను ఏజెంట్లకు వివరించారు. 'దేశ హితం, సంస్థ హితం, ఏజెంట్ల హితం, పాలసీదారుల హితం' అనే నినాదంతో ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని సూచించారు. వినియోగదారుల నమ్మకాన్ని చూరగొన్నప్పుడే వ్యాపార అభివృద్ధితో పాటు సమాజంలో గౌరవం లభిస్తుందని, తద్వారా ఏజెంట్ల కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమవుతాయని దిశానిర్దేశం చేశారు. అనంతరం అతిథులు ఆర్.శివకృష్ణ, ముక్కపాటి శ్రీనివాస్, ఎన్.అరుణ్ నాయక్‌లను సంఘం నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సెమినార్‌లో 50 మందికి పైగా ఏజెంట్లతో పాటు ఆల్ ఇండియా జోనల్, డివిజనల్, బ్రాంచ్ స్థాయి నాయకులు జి.రాంరెడ్డి, కె.బుచ్చిరెడ్డి, ఎం.వెంకటయ్య, సలీం పాషా, ఇమ్మడి భద్రయ్య, కె.దశరథ, బెజవాడ శేఖర్, వై.వెంకట్ రెడ్డి, సిహెచ్.రంగయ్య, ఎస్.నిరంజన్, వెంకటేష్,ముత్యాలు,శంకరయ్య,జాన్సీ,అనిత తదితరులు పాల్గొన్నారు.

Views: 28

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సిద్దిపేటలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటన.. సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన సిద్దిపేటలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటన.. సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన
సిద్దిపేటలో :- రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. ఈ నెల 19న (గురువారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలో...
సీఎం సభకు ప్రజలు భారీగా తరలిరావాలి: నీలం మధు ముదిరాజ్
పేద కుటుంబానికి అండగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
చౌటకూర్‌లో రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
గుడుంబా తయారీ స్థావరాలపై పోలీసుల దాడులు.. ఆరుగురిపై కేసులు నమోదు
ప్రశాంతంగా కొనసాగుతున్న కొనసాగుతున్న తె. యూ. డిగ్రీ ( V & VII ) సెమిస్టర్ పరీక్షలు
వివో భవన నిర్మాణ పనులు ప్రారంభం