వివో భవన నిర్మాణ పనులు ప్రారంభం
సర్పంచ్ గూగులోత్ అక్రీ రాంజీ నాయక్ పనులను పరిశీలించిన ఎంపీడీవో,ఎంపీవో
రాయపర్తి : మండలంలోని బంధనపల్లి గ్రామంలో మహిళా స్వయం సహాయక సంఘాల నూతన భవన నిర్మాణ పనులను ప్రారంభించినట్లు సర్పంచ్ గుగులోత్ అక్రీ రాంజీ నాయక్ తెలిపారు.బుధవారం నిర్వహించిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి పాక శ్రీనివాసులు,మండల పంచాయతీ అధికారి కూచన ప్రకాష్ పాల్గొని పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ... గ్రామంలోని మహిళా సంఘాల చిరకాల స్వప్నం నెరవేరుతుందని,భవన నిర్మాణానికి తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని అన్నారు.మహిళా సంఘాల సమావేశాలు,ఆర్థిక కార్యకలాపాల నిర్వహణకు సొంత భవనం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు.నిర్మాణ పనుల్లో ఎక్కడా రాజీ పడకుండా పూర్తి నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ,నిర్ణీత గడువులోగా భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సర్పంచ్ కోరారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మంద అశోక్,పంచాయతీ కార్యదర్శి డి.వీరేందర్,వార్డు సభ్యులు డెక్క బాబు,సిఎ చివ్వ రాజు,గుగులోత్ వాలు నాయక్ పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


