గుడుంబా తయారీ స్థావరాలపై పోలీసుల దాడులు.. ఆరుగురిపై కేసులు నమోదు
41 లీటర్ల గుడుంబా స్వాధీనం.. 700 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం రూ.3 లక్షలకు ఎమ్మార్వో ఎదుట బైండోవర్ కొయ్యూరు ఎస్సై మహేందర్
తాడిచెర్ల గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో గుడుంబా తయారీ స్థావరాలపై కొయ్యూరు పోలీసులు దాడులు నిర్వహించారు. వాగు వెంట కొందరు గుడుంబా తయారు చేస్తున్నారనే సమాచారంతో బుధవారం ఉదయం పోలీస్ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు.ఈ తనిఖీల్లో తాడిచెర్ల గ్రామానికి చెందిన అనుముల హరీష్, చిగురు క్రాంతికుమార్, బోనగిరి రాజయ్య, జోడు రవి, దుల్క చిన్న మల్లయ్య, బోనగిరి ఓదెలు గుడుంబా తయారు చేస్తుండగా గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు. వారి వద్ద నుంచి 41 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని, తయారీకి ఉపయోగించే సుమారు 700 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు.అనంతరం ఆరుగురిని ఎమ్మార్వో ఎదుట ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున బైండోవర్ చేశారు. తిరిగి గుడుంబా తయారు చేసినా, విక్రయించినా బైండోవర్ నిబంధనల ప్రకారం జరిమానాతో పాటు జైలు శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరించారు. అలాగే వారిపై షీట్లు కూడా ఓపెన్ చేస్తామని స్పష్టం చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


