అడ్డగూడూరు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఝాన్సీ రాణి సస్పెండ్
అడ్డగూడూరు, : యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఝాన్సీ రాణిని ఉన్నతా ధికారులు బుధవారం సస్పెండ్ చేశారు. విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన వంట మనిషి వెంకన్న విషయంలో నిర్లక్ష్యంగా వ్యహరించిన ప్రిన్సిపల్ ఝాన్సీ రాణిపై వేటు పడింది. నిందితుడు వంట మనిషి వెంకన్నను పోలీసులు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిందితుడి పై పోలీసులు పొక్సో కేసు నమోదు చేశారు. భువనగిరి డీసీపీ, అడిషనల్ ఎస్పీ పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టారు. ప్రిన్సిపాల్ ఝాన్సీ రాణి గతంలో పని చేసిన ఇమాంపేట స్కూల్‌లో ఇద్దరు విద్యార్థినులు పాఠశాలలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనలో సస్పెండ్ అయింది. ఆ తర్వాత ఝాన్సీ రాణి అడ్డగూడూరు కు వచ్చిన తర్వాత ఈ సంఘటన చోటు చేసుకోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తున్నాయి.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


