2,929 మందికి చేయూత పెన్షన్లు మంజూరు

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే గడ్డం వినోద్

2,929 మందికి చేయూత పెన్షన్లు మంజూరు

బెల్లంపల్లి మంచిర్యాల :  అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేయూత పెన్షన్ల పథకాన్ని అమలు చేస్తోందని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. బెల్లంపల్లి పట్టణంలోని వాసవి భవన్‌లో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బెల్లంపల్లి నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో 2,929 మంది లబ్ధిదారులకు చేయూత పెన్షన్లు మంజూరైనట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో పేదల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. రేషన్ కార్డుదారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మరుసటి రోజు నుంచి ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ దావా స్వాతి, మార్కెట్ కమిటీ చైర్మన్ సుకుమారి, మున్సిపల్ వైస్ చైర్మన్ సత్యనారాయణ,కౌన్సిలర్లు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Views: 113

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సిద్దిపేటలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటన.. సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన సిద్దిపేటలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటన.. సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన
సిద్దిపేటలో :- రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. ఈ నెల 19న (గురువారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలో...
సీఎం సభకు ప్రజలు భారీగా తరలిరావాలి: నీలం మధు ముదిరాజ్
పేద కుటుంబానికి అండగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
చౌటకూర్‌లో రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
గుడుంబా తయారీ స్థావరాలపై పోలీసుల దాడులు.. ఆరుగురిపై కేసులు నమోదు
ప్రశాంతంగా కొనసాగుతున్న కొనసాగుతున్న తె. యూ. డిగ్రీ ( V & VII ) సెమిస్టర్ పరీక్షలు
వివో భవన నిర్మాణ పనులు ప్రారంభం