బీబీనగర్ మండలం, లో 656 మందికి నూతన చేయూత పింఛన్లు మంజూరు

పి ఆర్ జి ఫంక్షన్ హాల్లో లబ్ధిదారులకు పింఛన్ మంజూరు ప్రొసీడింగ్స్ అందజేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

బీబీనగర్ మండలం, లో 656 మందికి నూతన చేయూత పింఛన్లు మంజూరు

బీబీనగర్ : మండల కేంద్రంలోని  అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఇందులో భాగంగా బీబీనగర్ మండల కేంద్రంలో మొత్తం 656 మందికి నూతన పింఛన్లు మంజూరు చేసింది. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని పి ఆర్ జి ఫంక్షన్ హాల్ లో కళాకారులచే ఆటపాటలతో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి  ముఖ్య అతిధిగా పాల్గొని నూతనంగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో నూతన పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. బీబీనగర్ మండలం లో 656 మందికి పింఛన్లు మంజూరు కావడం సంతోషకరమైన విషయమని, వీరందరికీ ప్రభుత్వ పరంగా అండగా నిలుస్తామని పేర్కొన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు అధికారంలో ఉండి కూడా అర్హులైన అనేకమంది పింఛన్ల కోసం ఎదురుచూసే పరిస్థితిని మార్చలేకపోయిందని ఎమ్మెల్యే విమర్శించారు. గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రజా ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడా ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలే నిదర్శనమని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, అర్హులైన వారికి సంక్షేమ ఫలాలు అందించడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కేవలం హామీలకే పరిమితం కాకుండా ప్రజల అవసరాలకు అనుగుణంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, పేదల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. నియోజకవర్గంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్తామని ఎమ్మెల్యే  పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్ శ్యాంసుందర్ రెడ్డి ,ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి,
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోలి పింగల్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ ఫోటోల శ్యామ్ గౌడ్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ వాకిటి చంద్రశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సురకంటి సత్తిరెడ్డి, గడ్డం బాల్ రెడ్డి, టం టం లక్ష్మయ్య, పంజాల వెంకటేష్ గౌడ్, బండారు ఆగమయ్య గౌడ్, సంధిగారి బసవయ్య, పిఎసిఎస్ మాజీ చైర్మన్ వాకిటి సంజీవరెడ్డి,మెట్టు శ్రీనివాస్ రెడ్డి, చెరుకు అచ్చయ్య గౌడ్, వేణు గౌడ్, కాంగ్రెస్ నాయకులు రాములు నాయక్, మాజీ ఎంపీటీసీలు పంజాల వెంకటేష్ గౌడ్, గోలి నరేందర్ రెడ్డి, బీబీనగర్ పట్టణ సర్పంచ్ పంజాల శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు టంటం రాఘవేందర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పేరబోయిన బసవరాజ్,   వివిధ గ్రామాల సర్పంచులు గ్రామ సెక్రెటరీ బీబీనగర్ పాలకవర్గంఉప సర్పంచ్ గోలి నరసింహారెడ్డి, వార్డ్ సభ్యులు ఆకుల రాజ్యలక్ష్మి దేవేందర్, కాసుల వరలక్ష్మి మహేష్ గౌడ్, పంజాల ప్రవీణ్ గౌడ్, పాశం కవిత మైపాల్, దేవరుప్పుల పృథ్వీరాజ్, రోడ్డ యమున, మంగ అశోక్, కట్ట వినోద్, సోమ శివకుమార్, నెల్లుట్ల శ్రీశైలం, ఆకుల దివ్య సాయికుమార్, పిట్టల శ్యామల శ్రీనివాస్, బుర్రి సుదర్శన్, మాజీ వార్డు సభ్యులు సామల వేణు, బండే ప్రవీణ్, యూత్ కాంగ్రెస్ నాయకులు గోరుకంటి మహేష్ కాంగ్రెస్ తదితరులు పాల్గొన్నారు.

Views: 199

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సిద్దిపేటలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటన.. సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన సిద్దిపేటలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటన.. సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన
సిద్దిపేటలో :- రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. ఈ నెల 19న (గురువారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలో...
సీఎం సభకు ప్రజలు భారీగా తరలిరావాలి: నీలం మధు ముదిరాజ్
పేద కుటుంబానికి అండగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
చౌటకూర్‌లో రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
గుడుంబా తయారీ స్థావరాలపై పోలీసుల దాడులు.. ఆరుగురిపై కేసులు నమోదు
ప్రశాంతంగా కొనసాగుతున్న కొనసాగుతున్న తె. యూ. డిగ్రీ ( V & VII ) సెమిస్టర్ పరీక్షలు
వివో భవన నిర్మాణ పనులు ప్రారంభం