సిద్దిపేటలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటన.. సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన
సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలి: అధికారులకు మంత్రి ఆదేశం రూ.544.11 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
సిద్దిపేటలో :- రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. ఈ నెల 19న (గురువారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా సభా ప్రాంగణం, వేదిక ఏర్పాటు, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించిన మంత్రి.. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.ఈ పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని మంత్రి వెల్లడించారు. అదేవిధంగా రూ.544.11 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు తెలిపారు.బహిరంగ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున సభా వేదిక, కుర్చీలు, తాగునీటి సౌకర్యం, తాత్కాలిక మరుగుదొడ్లు, నిరంతర విద్యుత్ సరఫరా, సౌండ్ సిస్టమ్, వైద్య శిబిరం, అంబులెన్స్‌ల ఏర్పాటు తదితర అంశాలపై మంత్రి అధికారులతో సమీక్షించారు.అలాగే ముఖ్యమంత్రి హెలికాప్టర్ దిగేందుకు హెలిప్యాడ్ ఏర్పాటు, ముఖ్యమంత్రి పర్యటనలో భద్రతా ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు.ముఖ్యమంత్రి పర్యటనకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని, అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి సభను విజయవంతం చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


