రైతులందరికీ ఇందిరమ్మ బీమా కల్పించాలి
నారాయణపేట : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తున్న ఇందిరమ్మ బీమా పథకం ద్వారా రైతులందరికీ బీమా సౌకర్యం కల్పించాలని సామాజిక కార్యకర్త హెచ్. నర్సింహా రాష్ట్ర ప్రభుత్వానికి మరియు సంబంధిత అధికారులకు బుధవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఇందిరమ్మ జీవిత బీమా పథకం లో సవరణ చేసి రైతు బీమా మాదిరిగా రైతులందరికీ ఈ పథకాలలో అవకాశం కల్పించి న్యాయం చేయాలని కోరారు.కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ బీమా వర్తించడం వలన ఆ కుటుంబంలోని మిగిలిన రైతులకు అన్యాయం జరుగుతుందని అన్నారు. రైతులు రాత్రి,పగలు పొలాల్లో పనులు చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంది కావున ఇలాంటి బీమా సౌకర్యం కల్పించి ఆ కుటుంబాలను ఆదుకోవడం ప్రభుత్వాల బాధ్యత అని తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


