మహబూబ్ నగర్ జిల్లా గండీడు మండలము

మహబూబ్ నగర్  జిల్లా గండీడు మండలము

 నిజమైన అర్హులందరికీ పెన్షన్ అందేలా కృషి చేస్తాం గండీడు మండల పరిధిలోని వెన్నచేడ్ గ్రామంలో ఈరోజు సెప్టెంబర్ 18 రోజు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద నూతనంగా పెన్షన్ మంజూరైన లబ్ధిదారులకు పెన్షన్ ప్రొసీడింగ్స్‌ను గ్రామ సర్పంచ్ గుర్రాల నవనీత చెన్నయ్య, గండేడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనంత లక్ష్మారెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు నిజమైన అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం పెన్షన్ మంజూరైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇంకా అర్హత ఉండి పెన్షన్ పొందని వారు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీగా పెన్షన్ అందేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ విలేజ్ సెక్రటరీ చెన్నకేశవులు, PACS డైరెక్టర్ పుష్పలత గోపాల్, పులిందర్ రెడ్డి, పెద్దాపురం చెన్నయ్య, ఆశన్న గౌడ్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సిద్దిపేటలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటన.. సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన సిద్దిపేటలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటన.. సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన
సిద్దిపేటలో :- రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. ఈ నెల 19న (గురువారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలో...
సీఎం సభకు ప్రజలు భారీగా తరలిరావాలి: నీలం మధు ముదిరాజ్
పేద కుటుంబానికి అండగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
చౌటకూర్‌లో రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
గుడుంబా తయారీ స్థావరాలపై పోలీసుల దాడులు.. ఆరుగురిపై కేసులు నమోదు
ప్రశాంతంగా కొనసాగుతున్న కొనసాగుతున్న తె. యూ. డిగ్రీ ( V & VII ) సెమిస్టర్ పరీక్షలు
వివో భవన నిర్మాణ పనులు ప్రారంభం