మోత్కరావుపేటలో రూ.3.30 లక్షలతో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి అనుమతులు
మేడిపల్లి / భీమారం : మోత్కరావుపేట గ్రామంతో పాటు చుట్టూ పక్కల ప్రాంతాలలో విద్యుత్ వినియోగం రోజురోజుకూ పెరుగుతుండటంతో పాటు, దీర్ఘకాలిక ఫీడర్ల కారణంగా వినియోగదారులు తరచూ విద్యుత్ అంతరాయాలను ఎదుర్కొంటున్నట్లు అధికారులు గుర్తించారు. పెరుగుతున్న విద్యుత్ లోడ్‌కు అనుగుణంగా సరఫరా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఏర్పడటంతో నూతన సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రతిపాదించడంతో మోత్కరావుపేట గ్రామంలో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGNPDCL) పరిపాలనా, సాంకేతిక అనుమతులు మంజూరు చేసింది. మొత్తం రూ.3 కోట్ల 30 లక్షల 18 వేల అంచనా వ్యయంతో ఈ సబ్‌స్టేషన్‌ను నిర్మించేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


