చికోడ్ జిల్లా పరిషత్ హైస్కూల్‌లో షోటోకాన్ కరాటే గ్రాండ్ బెల్ట్ టెస్ట్

28 మంది విద్యార్థులకు బెల్ట్ పరీక్ష నిర్వహించి బెల్టులు ప్రదానం చేసిన గ్రాండ్ మాస్టర్ నగేష్

చికోడ్ జిల్లా పరిషత్ హైస్కూల్‌లో షోటోకాన్ కరాటే గ్రాండ్ బెల్ట్ టెస్ట్

మండలంలోని చికోడ్ జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఈరోజు షోటోకాన్ కరాటే గ్రాండ్ బెల్ట్ టెస్ట్ నిర్వహించారు. ఈ పరీక్షలో 28 మంది విద్యార్థులు పాల్గొని తమ కరాటే నైపుణ్యాలను ప్రదర్శించారు. విద్యార్థులు గత రెండు సంవత్సరాలుగా స్థానిక కరాటే మాస్టర్ సుదర్శన్ వద్ద కరాటేలో శిక్షణ పొందుతున్నారు. శిక్షణలో భాగంగా నిర్వహించిన గ్రాండ్ బెల్ట్ టెస్ట్‌లో గ్రాండ్ మాస్టర్ నగేష్ విద్యార్థుల ప్రతిభను పరీక్షించి, అర్హులైన వారికి బెల్టులు ప్రదానం చేశారు. కరాటే శిక్షణ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, శారీరక దృఢత్వం, ఆత్మరక్షణ నైపుణ్యాలను పెంపొందిస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైన్జుకి షోటోకాన్ స్పోర్ట్స్ కరాటే అకాడమీ మాస్టర్లు గజేంద్రులు, నర్సింలు, సుదర్శనం, పరశురాం, మణి వర్ధన్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ వారిని మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

Views: 77

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సిద్దిపేటలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటన.. సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన సిద్దిపేటలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటన.. సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన
సిద్దిపేటలో :- రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. ఈ నెల 19న (గురువారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలో...
సీఎం సభకు ప్రజలు భారీగా తరలిరావాలి: నీలం మధు ముదిరాజ్
పేద కుటుంబానికి అండగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
చౌటకూర్‌లో రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
గుడుంబా తయారీ స్థావరాలపై పోలీసుల దాడులు.. ఆరుగురిపై కేసులు నమోదు
ప్రశాంతంగా కొనసాగుతున్న కొనసాగుతున్న తె. యూ. డిగ్రీ ( V & VII ) సెమిస్టర్ పరీక్షలు
వివో భవన నిర్మాణ పనులు ప్రారంభం