వెండికోల్ గ్రామంలో రూ.6 కోట్లతో హెచ్‌ఎండీ రోడ్డు పనులకు భూమిపూజ
గ్రామ సర్పంచ్ మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం
చౌటకూర్ : సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని వెండికోల్ గ్రామంలో రూ.6 కోట్ల నిధులతో చేపట్టనున్న హెచ్‌ఎండీ రోడ్డు నిర్మాణ పనులకు గ్రామ సర్పంచ్ మల్లారెడ్డి ఆధ్వర్యంలో భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మల్లారెడ్డి మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధిలో భాగంగా ఈ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించడం ఎంతో సంతోషకరమని అన్నారు. రూ.6 కోట్లతో నిర్మిస్తున్న ఈ రహదారి పూర్తయితే గ్రామ ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయం అందుబాటులోకి వస్తుందని, ప్రయాణ కష్టాలు తీరుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు నందికంటి రామచంద్రారెడ్డి, చౌటకూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోడపట్ల గణేశ్ ముదిరాజ్, ఎంపీడీవో శంకర్, మాజీ ఎంపీపీ సుభాష్ రెడ్డి, శివ్వంపేట సర్పంచ్ సంధ్యారాణి మల్లికార్జున్, లింగంపల్లి సర్పంచ్ రాజు, ఉప్పరిగూడెం సర్పంచ్ మల్లేశం, పోసానిపల్లి సర్పంచ్ రేఖ బాలరాజ్, కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, మండల బీసీ సెల్ అధ్యక్షుడు ఆంజనేయులు, తవద్దానపల్లి ఉపసర్పంచ్ మౌలానా, సుల్తాన్‌పూర్ మాజీ ఉపసర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ మల్లేశం, నాయకులు రామ్మోహన్, ప్రేమసాగర్, పత్తి రాములు, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


