పగలు, రాత్రిళ్ళు వీధుల్లో కోతులు స్వైరవిహారం..

పగలు, రాత్రిళ్ళు  వీధుల్లో కోతులు స్వైరవిహారం..

నాంపల్లిమండల కేంద్రంలో కోతుల బెడద రోజురోజుకూ తీవ్రమవుతోంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా కోతులు వీధుల్లో స్వైరవిహారం చేస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గుంపులుగా సంచరిస్తూ ఇళ్లలోకి చొరబడటం, ఇంట్లో ఉన్న వస్తువులను చిందరవందర చేయడం, ఆహార పదార్థాలను ఎత్తుకెళ్లడం వంటి ఘటనలతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కోతుల భయంతో నిత్యజీవిత కార్యకలాపాలు సైతం సజావుగా సాగని పరిస్థితి నెలకొందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఉదయం వేళ మహిళలు ఇంటి ముందు కళ్లాపి చల్లాలన్నా, ఇంటి పరిసరాలను శుభ్రం చేయాలన్నా కోతులు ఎక్కడి నుంచి వచ్చి మీద పడతాయోనని భయపడుతున్నారు. చిన్నారులు పాఠశాలలకు వెళ్లే సమయంలో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఒంటరిగా బయటకు వెళ్లేందుకు పిల్లలు జంకుతున్నారని స్థానికులు చెబుతున్నారు. వృద్ధులు, మహిళలు, చిన్నారుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ప్రజలు తమ రోజువారీ పనులు చేసుకోవాలన్నా ముందుగా కోతుల సంచారాన్ని గమనించాల్సిన దుస్థితి ఏర్పడింది.ఇళ్లలోకి చొరబడుతున్న కోతులు వంటగదుల్లోని ఆహార పదార్థాలను చిందరవందర చేయడమే కాకుండా, ఇంట్లోని వస్తువులను కిందపడేసి ధ్వంసం చేస్తున్నాయి. వాటిని బయటకు తరిమేందుకు స్థానికులు నానా అవస్థలు పడుతున్నారు. ఎప్పుడు ఏ ఇంట్లోకి చొరబడతాయో, ఎవరిపై దాడి చేస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది.కోతులు మూగజీవాలే అయినప్పటికీ, అవి గుంపులుగా దాడి చేస్తే మనుషులకు తీవ్ర గాయాలు కలిగే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కోతుల బెడదతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల భద్రతకు సంబంధించిన సమస్యపై ఇంత నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఏదైనా ప్రమాదకర సంఘటన జరిగిన తర్వాతే అధికారులు స్పందిస్తారా? ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత లేదా? అంటూ నిలదీస్తున్నారు. కోతుల బెడదను అరికట్టేందుకు సంబంధిత మండల, గ్రామపంచాయతీ అధికారులు తక్షణమే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. కోతులను సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతాలకు తరలించేలా అటవీశాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి, సమస్యను తీవ్రంగా పరిగణించి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Views: 52

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సిద్దిపేటలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటన.. సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన సిద్దిపేటలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటన.. సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన
సిద్దిపేటలో :- రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. ఈ నెల 19న (గురువారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలో...
సీఎం సభకు ప్రజలు భారీగా తరలిరావాలి: నీలం మధు ముదిరాజ్
పేద కుటుంబానికి అండగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
చౌటకూర్‌లో రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
గుడుంబా తయారీ స్థావరాలపై పోలీసుల దాడులు.. ఆరుగురిపై కేసులు నమోదు
ప్రశాంతంగా కొనసాగుతున్న కొనసాగుతున్న తె. యూ. డిగ్రీ ( V & VII ) సెమిస్టర్ పరీక్షలు
వివో భవన నిర్మాణ పనులు ప్రారంభం