రాయికల్ మండలంలో 593 మందికి చేయూత పింఛన్లు
రాయికల్, : ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రాయికల్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో బుధవారం చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలవ్యాప్తంగా మొత్తం 593 మందికి పింఛన్లు మంజూరయ్యాయి. వాటిలో 290 వితంతు పింఛన్లు, 106 దివ్యాంగుల పింఛన్లు, 120 కల్లుగీత కార్మికుల పింఛన్లు, 77 ఒంటరి మహిళల పింఛన్లు ఉన్నాయి. గ్రామాల వారీగా నిర్వహించిన కార్యక్రమాల్లో ఎంపీడీఓ, గ్రామ సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొని లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. అర్హులైన పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


