విద్యార్థినుల ఆరోగ్యమే ప్రాధాన్యత.. రుతుక్రమ పరిశుభ్రతపై అవగాహనే లక్ష్యం!

విద్యార్థినుల ఆరోగ్యమే ప్రాధాన్యత.. రుతుక్రమ పరిశుభ్రతపై అవగాహనే లక్ష్యం!

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 400 శానిటరీ కిట్ల ను అందజేసిన ఆవుల రాజిరెడ్డి మెదక్, నర్సాపూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నేడు రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు 400 శానిటరీ కిట్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి , రాజన్న ఫౌండేషన్ వైస్ చైర్‌పర్సన్ శ్రీమతి డా. శైలజా రెడ్డి పాల్గొని విద్యార్థినులకు శానిటరీ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి గారు మాట్లాడుతూ.. మహిళల ఆరోగ్యం, ఆడపిల్లల ఆత్మగౌరవం ప్రతి ఒక్కరికీ ముఖ్యమని, రుతుక్రమం అనేది సహజమైన ప్రక్రియ అని, దానిపై సిగ్గు, సంకోచం కాకుండా సరైన అవగాహన కలిగి ఉండాలని అన్నారు. విద్యార్థినులు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. డా. శైలజా రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థినుల్లో రుతుక్రమ పరిశుభ్రతపై అవగాహన పెంపొందించడం, ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ అవసరమైన పరిశుభ్రత ఉత్పత్తులు అందుబాటులో ఉండేలా చూడటమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. రుతుక్రమం సిగ్గుపడాల్సిన విషయం కాదు.. ప్రతి బాలిక ఆరోగ్యానికి అవసరమైన సహజ ప్రక్రియ. ప్రతి విద్యార్థినికి ఆరోగ్యం, గౌరవం, ఆత్మవిశ్వాసం అందించడమే మా లక్ష్యం" అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థినుల్లో ఆరోగ్య అవగాహన పెంపొందించడంతో పాటు మహిళా సాధికారత, సామాజిక బాధ్యత పట్ల రాజన్న ఫౌండేషన్ తన నిబద్ధతను చాటుకుంది. కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సిద్దిపేటలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటన.. సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన సిద్దిపేటలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటన.. సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన
సిద్దిపేటలో :- రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. ఈ నెల 19న (గురువారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలో...
సీఎం సభకు ప్రజలు భారీగా తరలిరావాలి: నీలం మధు ముదిరాజ్
పేద కుటుంబానికి అండగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
చౌటకూర్‌లో రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
గుడుంబా తయారీ స్థావరాలపై పోలీసుల దాడులు.. ఆరుగురిపై కేసులు నమోదు
ప్రశాంతంగా కొనసాగుతున్న కొనసాగుతున్న తె. యూ. డిగ్రీ ( V & VII ) సెమిస్టర్ పరీక్షలు
వివో భవన నిర్మాణ పనులు ప్రారంభం