చౌటకూర్‌లో రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
చౌటకూర్ :- రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన చౌటకూర్ మండలం పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చౌటకూర్ మండలం సర్దాపూర్ గ్రామ సమీపంలోని సంగారెడ్డి–నాందేడ్–అకోలా 161 జాతీయ రహదారిపై ఉన్న ఫ్లైఓవర్ వంతెనపై ఈ నెల 13న రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సర్దాపూర్ గ్రామానికి చెందిన వంజరి మల్లేశం, కోర్పోలు గ్రామానికి చెందిన మన్నె నరేష్ మోటార్ బైక్‌పై జోగిపేటకు వెళ్తున్నారు.ఈ క్రమంలో వారి ముందు వెళ్తున్న గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొనడంతో ఇద్దరూ బైక్‌పై నుంచి కిందపడిపోయి గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, తీవ్రంగా గాయపడిన మల్లేశం చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామంలో విషాదం నెలకొంది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


