ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు విజ్ఞప్తి

ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు విజ్ఞప్తి

ఆదిలాబాద్ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు, వివిధ నామినేటెడ్ పదవుల్లో కొనసాగుతున్న నాయకులకు, ప్రజాప్రతినిధులకు మరియు పార్టీ ముఖ్య బాధ్యులకు నా విజ్ఞప్తి.మనమందరం కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులుగా, మన భుజంపై కాంగ్రెస్ పార్టీ కండువాను తప్పనిసరిగా ధరించాలని కోరుతున్నాను.

ముఖ్యంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ సమావేశంలో, పార్టీ కార్యక్రమంలోనే కాకుండా, ప్రభుత్వ పరంగా నిర్వహించే అధికారిక సమావేశాలు, సమీక్షా సమావేశాలు మరియు ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరయ్యే సందర్భాల్లో కూడా వివిధ నామినేటెడ్ పదవుల్లో కొనసాగుతున్న నాయకులు, ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా తమ భుజంపై కాంగ్రెస్ పార్టీ కండువాను ధరించాలని మనవి చేస్తున్నాను.కాంగ్రెస్ పార్టీ కండువా కేవలం ఒక వస్త్రం మాత్రమే కాదు. అది మన పార్టీ గుర్తింపుకు, సిద్ధాంతాలకు, విలువలకు మరియు మన బాధ్యతకు ప్రతీక. మనం ప్రతి సందర్భంలోనూ కండువా ధరించడం ద్వారా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ గుర్తింపు, గౌరవం మరింత స్పష్టంగా కనిపించడంతో పాటు, పార్టీ కార్యకర్తల్లో కూడా నూతన ఉత్సాహం, మనోధైర్యం పెరుగుతాయి.

అందువల్ల పార్టీ గౌరవాన్ని పెంపొందించేందుకు, కార్యకర్తలకు ఆదర్శంగా నిలిచేందుకు, మనమందరం ప్రతి పార్టీ సమావేశంలో, పార్టీ కార్యక్రమంలో మరియు ప్రభుత్వ పరమైన అధికారిక సమావేశాల్లో సైతం కాంగ్రెస్ పార్టీ కండువాను తప్పనిసరిగా భుజంపై ధరించాలని కోరుతూ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.

ఇట్లు,

డాక్టర్ నరేష్ జాదవ్ అధ్యక్షులు, ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ.

జై కాంగ్రెస్!  జై హింద్!

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సిద్దిపేటలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటన.. సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన సిద్దిపేటలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటన.. సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన
సిద్దిపేటలో :- రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. ఈ నెల 19న (గురువారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలో...
సీఎం సభకు ప్రజలు భారీగా తరలిరావాలి: నీలం మధు ముదిరాజ్
పేద కుటుంబానికి అండగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
చౌటకూర్‌లో రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
గుడుంబా తయారీ స్థావరాలపై పోలీసుల దాడులు.. ఆరుగురిపై కేసులు నమోదు
ప్రశాంతంగా కొనసాగుతున్న కొనసాగుతున్న తె. యూ. డిగ్రీ ( V & VII ) సెమిస్టర్ పరీక్షలు
వివో భవన నిర్మాణ పనులు ప్రారంభం