మల్లారం గ్రామంలో ఇసుక క్వారీని నిలిపివేయాలి
రైతుల భూములు, భూగర్భ జలాలను కాపాడాలి.. జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం
మల్హర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం మల్లారం గ్రామంలో ఇసుక క్వారీని వెంటనే నిలిపివేయాలని కోరుతూ గ్రామ రైతులు జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇసుక క్వారీ నిర్వహణ వల్ల తమ పంట పొలాలు, భూగర్భ జలాలు తీవ్రంగాప్రభావితమవుతున్నాయని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.క్వారీ కారణంగా భూగర్భ జలాలు తగ్గిపోయి పంటలకు సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇసుక రవాణా వల్ల గ్రామ రహదారులుదెబ్బతింటున్నాయని, వాహనాల రాకపోకలతో వెలువడుతున్న ధూళి కారణంగా గ్రామ ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని వివరించారు.రైతుల జీవనాధారమైన వ్యవసాయాన్ని, పంట భూములను, భూగర్భ జలాలను కాపాడేందుకు ఇసుక క్వారీని తక్షణమే నిలిపివేసి రైతులకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు. రైతుల సమస్యలను కలెక్టర్ సావధానంగా విని, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.కలెక్టర్‌ను కలిసిన వారిలో ఉపసర్పంచ్ ఆవిర్నేని పురుషోత్తం, రావు, నేరేడుగొమ్మ రాజేశ్వరరావు, గంగదారి సమ్మయ్య, ప్రకాశ్ రావు, మల్హాల్ రావు.రాజేశ్వర్ రావు, రేవల్లి లింగయ్య, రాములు, మల్లయ్య, స్వామి, మేచినేని మహేందర్ రావు, దాదే సునీల్ రావు పటేల్ తదితరులు ఉన్నారు.మల్లారం రైతుల న్యాయమైన పోరాటానికి గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు అండగా నిలవాలని వారు కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

