విద్యార్థుల సృజనాత్మకతకు, సామాజిక అవగాహనకు వేదికగా సోషల్ మేళా

విద్యార్థుల సృజనాత్మకతకు, సామాజిక అవగాహనకు వేదికగా సోషల్ మేళా

మేడిపల్లి/భీమారం (జగిత్యాల) : కట్లకుంట గ్రామంలోని 
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోషల్ స్టడీస్ ఉపాధ్యాయుడు ఏ. వైకుంఠం ఆధ్వర్యంలో సోషల్ మేళా–2027 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 60 మంది విద్యార్థులకి పైగా మోడల్స్ ప్రదర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంఘిక శాస్త్రంలోని చరిత్ర, భూగోళశాస్త్రం, పౌరశాస్త్రం, ఆర్థికశాస్త్రం వంటి వివిధ అంశాలపై ఆకర్షణీయమైన నమూనాలు, త్రీడీ మోడల్స్, చార్టులు, పోస్టర్లు, అవి పని చేసే నమూనాలను ప్రదర్శించారు. విద్యార్థులు భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ఎన్నికల ప్రక్రియ, అడవుల ప్రాముఖ్యత, ప్రకృతి వనరులు, ఉపాధి, పర్యావరణ పరిరక్షణ, క్రీడలు మరియు గ్రామీణ అభివృద్ధి వంటి సమకాలీన అంశాలను తమ ప్రదర్శనల ద్వారా వివరించారు. విద్యార్థులు స్వయంగా రూపొందించిన నమూనాలను సందర్శకులకు వివరిస్తూ తమలోని సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, విషయ పరిజ్ఞానాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మాట్లాడుతూ, పుస్తక జ్ఞానంతో పాటు ఆచరణాత్మక అనుభవం కూడా విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఎంతో అవసరమని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో పరిశోధనా దృక్పథాన్ని, సామాజిక బాధ్యతను, ప్రజాస్వామ్య విలువలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. నేర్చుకుందాం–ఆలోచిద్దాం– సృజిద్దాం–సమాజ అభివృద్ధికి తోడ్పడదాం అనే సందేశంతో సోషల్ మేళా–2027 ముగిసింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బి హనుమాన్ సాగర్, ఉపాధ్యాయులు వై శ్రీధర్, పి రమాదేవి, ఏ గోపిక్రిష్ణ, సీ  హెస్ రవీందర్, ఎస్. సంతోష్, సాజిద్ రెహానా తదితరులు పాల్గొన్నారు.

Views: 33

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సిద్దిపేటలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటన.. సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన సిద్దిపేటలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటన.. సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన
సిద్దిపేటలో :- రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. ఈ నెల 19న (గురువారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలో...
సీఎం సభకు ప్రజలు భారీగా తరలిరావాలి: నీలం మధు ముదిరాజ్
పేద కుటుంబానికి అండగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
చౌటకూర్‌లో రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
గుడుంబా తయారీ స్థావరాలపై పోలీసుల దాడులు.. ఆరుగురిపై కేసులు నమోదు
ప్రశాంతంగా కొనసాగుతున్న కొనసాగుతున్న తె. యూ. డిగ్రీ ( V & VII ) సెమిస్టర్ పరీక్షలు
వివో భవన నిర్మాణ పనులు ప్రారంభం