మృతురాలి కుటుంబానికి ఏవీ రెడ్డి ఆర్థిక సాయం
నాంపల్లి మండలంలోని చిట్టెంపహాడ్ గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యుడు అబ్బనబోయిన రమేష్ యాదవ్ మాతృమూర్తి ముత్తమ్మ గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ జడ్పీటీసీ ఏవీ రెడ్డి గ్రామానికి చేరుకుని మృతురాలి పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి అండగా నిలుస్తూ రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆపద సమయంలో బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రజా సేవకై నిత్యం పరితపించే మాజీ జడ్పిటిసి ఏవి రెడ్డి అని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ సర్పంచ్ అబ్బనబోయిన చందు యాదవ్,గ్రామ పెద్దలు, యువకులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


