నిర్మల్ శ్యామ్‌గఢ్ కోట భూముల కబ్జాపై సమగ్ర విచారణ జరిపించాలి
- ప్రభుత్వ భూములను పరిరక్షించి, అక్రమ రెవెన్యూ రికార్డులను రద్దు చేయాలి - కలెక్టరేట్ ఏవో కు వినతిపత్రం అందజేసిన ఆప్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్.
నిర్మల్ జిల్లా ప్రతినిధి : నిర్మల్ పట్టణంలోని చారిత్రక శ్యామ్‌గఢ్ కోట భూముల రెవెన్యూ రికార్డుల్లో ప్రైవేట్ వ్యక్తుల పేర్లు నమోదైన వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్ ఏవో ప్రవీణ్ కుమార్‌కు ఆప్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, జిల్లా అధ్యక్షులు సయ్యద్ హైదర్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోటకు సంబంధించిన పాత రెవెన్యూ రికార్డులు, ఖాస్రా పహాణీ, సేత్వార్, సర్క్యులర్ ముంతఖబ్‌లను పరిశీలించాలని కోరారు. అలాగే అక్రమంగా జారీ అయినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పట్టాదారు పాస్‌బుక్కులు, పహాణీలలో నమోదైన ప్రైవేట్ వ్యక్తుల పేర్లపై సమగ్ర విచారణ జరిపి, అక్రమాలు నిర్ధారణ అయితే సంబంధిత రికార్డులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుని చారిత్రక శ్యామ్‌గఢ్ కోట ప్రభుత్వ భూములను పరిరక్షించాలని కోరారు.

About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


