ఆర్మూర్లో ఏటీఎం చోరీకి యత్నం
నిజామాబాద్ : ఆర్మూర్ పట్టణంలో ఏటీఎం చోరీకి దొంగలు యత్నించారు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్మూర్ పట్టణంలోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలోకి రాత్రివేళ ఇద్దరు దుండగులు ప్రవేశించారు. రాడ్ సాయంతో ధ్వంసం చేశారు. అనంతరం నగదు ఎత్తుకెళ్లేందుకు యత్నించారు. అయితే నగదు ఉన్న బాక్సులు ఓపెన్ కాకపోవడంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. నిందితులు ఏటీఎం ధ్వంసం చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


