ఇసుక తరలిస్తున్న బోలోరే వాహనం ఢీకొని కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు
గంభీరావుపేట : గంభీరావుపేట మండలంలోనీ లింగన్నపేట గ్రామంలో అక్రమ ఇసుక రవాణా నిరోధించే క్రమంలో జరిగిన ప్రమాదంలో బ్లూ కోర్ట్ కానిస్టేబుల్ ఆకుల రమేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం రాత్రి ఎల్లారెడ్డిపేట మండలం నుంచి గంభీరావుపేట మండలం లింగన్నపేటకు బొలెరో గూడ్స్ వాహనంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం మేరకు, బ్లూ కోర్ట్ కానిస్టేబుల్స్ ఆకుల రమేష్, హోంగార్డ్ మైపాల్ ఆ వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.లింగన్నపేటలో ఇసుకను ఖాళీ చేసి అర్ధరాత్రి తిరిగి వస్తున్న ఆ వాహనాన్ని పోలీసులు నిలువరించేందుకు యత్నించగా, డ్రైవర్ వారిపైకి వాహనాన్ని దూసుకెళ్లాడు. ఈ క్రమంలో కానిస్టేబుల్ ఆకుల రమేష్‌ను బొలెరో గూడ్స్ ఢీకొట్టడంతో పాటు, ఆయన చేతి మరియు కాలుపై నుంచి వాహనం వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గాయపడిన రమేష్ ను ఎల్లారెడ్డిపేట అశ్విని హాస్పిటల్ తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్ తరలించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


