నకిలీ కరెన్సీ కోసం రూ.5 లక్షలు చెల్లించి మోసపోయిన ముఠా
- కిడ్నాప్ కేసులో ముగ్గురు, నకిలీ కరెన్సీ కేసులో ముగ్గురు అరెస్ట్
- రెండు కేసుల్లో మొత్తం ఆరుగురు అరెస్ట్
- కారు, మొబైల్ ఫోన్లు, నగదు స్వాధీనం. డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి
ఆదిలాబాద్ : నకిలీ కరెన్సీ ద్వారా సులభంగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో నేరానికి పాల్పడి, అనంతరం తమ డబ్బును తిరిగి రాబట్టేందుకు ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసినట్లు కథ సృష్టించిన ఘటనలో మొత్తం ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి తెలిపారు. వివరాల ప్రకారం.. పడార్కవాడ చెందిన ప్రతీక్ ద్వారా దీపక్ పవార్, అలోక్, సురేందర్ తదితరులకు నాగ్‌పూర్‌కు చెందిన నకిలీ కరెన్సీ గ్యాంగ్‌తో పరిచయం ఏర్పడింది. రూ.1 లక్షకు రూ.4 లక్షల నకిలీ కరెన్సీ ఇస్తామని, వాటిని చలామణి చేస్తే భారీగా లాభాలు పొందవచ్చని గ్యాంగ్ నమ్మించింది. దీంతో రూ.5 లక్షలు చెల్లించి రూ.20 లక్షల నకిలీ కరెన్సీ పొందాలని వారు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో సురేందర్ మరియు ఇద్దరు మహారాష్ట్రకు చెందిన షేక్ షకీబ్ వద్ద ఐదు లక్షల రూపాయలను తీసుకొని నకిలీ కరెన్సీ గ్యాంగ్ సభ్యులకు డబ్బులు ఇచ్చి అందులో వచ్చిన లాభంలో వాటాను తీసుకునే విధంగా పథకాన్ని రచించారు, కానీ జరిగిన కథనం సెప్టెంబర్ 10న ఆదిలాబాద్ జిల్లా మావల బైపాస్ వద్ద నకిలీ కరెన్సీ గ్యాంగ్ సభ్యులకు రూ.5 లక్షలు అందజేశారు. డబ్బులు తీసుకున్న అనంతరం గ్యాంగ్ సభ్యులు నకిలీ కరెన్సీ ఉన్నట్లు చూపిస్తూ బాక్స్‌ను తెచ్చారు. అదే సమయంలో ముందస్తు పథకం ప్రకారం నకిలీ కరెన్సీ గ్యాంగ్ సభ్యులు మరో వ్యక్తులు అక్కడికి చేరుకుని పోలీసులమని బెదిరిస్తూ, అసలు రూ.5 లక్షలు తిరిగి ఇవ్వకుండా రెండు కార్లలో నాగ్‌పూర్ వైపు పరారయ్యారు. (నకిలీ కరెన్సీ గ్యాంగ్ సభ్యులు మరియు పోలీసులమని చెప్తున్న గ్యాంగ్ ) రూ.5 లక్షలు కోల్పోయిన షేక్ షకీబ్ మరో ఇద్దరు మహ్మద్ సితార్, ప్రథమ్ లతో కలిసి తమ డబ్బును తిరిగి రాబట్టేందుకు సురేందర్, అలోక్, దీపక్‌లను తమ అదుపులో ఉంచారు. అనంతరం సురేందర్‌తో అతని భార్యకు ఫోన్ చేయించి, తనను కిడ్నాప్ చేశారని, రూ.5 లక్షలు చెల్లిస్తేనే విడుదల చేస్తామని చెప్పించారు. దీంతో సురేందర్ భార్య మావల పోలీసులను ఆశ్రయించడంతో Cr.No.624/2026 U/S 140(3) BNS కింద కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు నకిలీ కరెన్సీ వ్యవహారంపై Cr.No.631/2026 U/S 318(4), 308(5) r/w 3(5) BNS కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా సెప్టెంబర్ 13న దస్నాపూర్ పెట్రోల్ బంక్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు నిందితులు ప్రయాణిస్తున్న కారును గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో రెండు కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చాయి.
కిడ్నాప్ కేసులో అరెస్టైన ముగ్గురు నిందితులు:
1. షేక్ షకీబ్ @ ఎం.డి. షకీబ్ (24) s/o హదీస్, నివాసం: అబాబకర్‌పూర్, చైన్‌పూర్, వైశాలి జిల్లా, బీహార్; ప్రస్తుతం గడ్చందూర్, చంద్రపూర్ జిల్లా, మహారాష్ట్ర.
2. మహ్మద్ సితార్ (20) s/o హమీద్, నివాసం: ఫతేపూర్ చక్ సులేమాన్, అబాబకర్‌పూర్, వైశాలి జిల్లా, బీహార్; ప్రస్తుతం గడ్చందూర్, చంద్రపూర్ జిల్లా, మహారాష్ట్ర.
3. ప్రథమ్ రవీంద్ర గురుకుందల్వార్ (20) s/o రవీంద్ర, నివాసం: గడ్చందూర్, చంద్రపూర్ జిల్లా, మహారాష్ట్ర.
నకిలీ కరెన్సీ కేసులో అరెస్టైన ముగ్గురు నిందితులు:
1. దీపక్ శ్రీరామ్ పవార్ (33) s/o శ్రీరామ్, రాధేనగరి, పంధర్‌కవాడ, యవత్మాల్ జిల్లా, మహారాష్ట్ర.
2. సర్కార్ అలోక్ (46) s/o అమలేందు, నివాసం: దహేగావ్ గ్రామం, బేలా మండలం, ఆదిలాబాద్ జిల్లా.
3. ఎల్చల్వార్ సురేందర్ (38) s/o గంభీర్, నివాసం: కేఆర్‌కే కాలనీ, ఆదిలాబాద్.
పరారీలో ఉన్న నిందితులు
1. ప్రతీక్ — పంధర్‌కవాడ, మహారాష్ట్ర.
2. నాగ్‌పూర్‌కు చెందిన నకిలీ కరెన్సీ నలుగు గ్యాంగ్ సభ్యులు — ఇతర వివరాలు దర్యాప్తులో ఉన్నాయి.కిడ్నాప్ కేసులో షేక్ షకీబ్ వద్ద నుంచి Hyundai i20 కారు, iPhone 17 Pro మొబైల్ ఫోన్, రూ.20,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ కరెన్సీ కేసులో దీపక్ వద్ద నుంచి రూ.10,000 నగదు, Vivo మొబైల్ ఫోన్, అలోక్ వద్ద నుంచి Oppo మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు కేసుల్లో పరారీలో ఉన్న ప్రతీక్‌తో పాటు నాగ్‌పూర్‌కు చెందిన నకిలీ కరెన్సీ గ్యాంగ్ సభ్యుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి తెలిపారు. అత్యాశకు గురై నకిలీ కరెన్సీ వ్యవహారాల్లో చిక్కుకోవడం, అక్రమంగా డబ్బు సంపాదించాలనే ప్రయత్నం చివరకు నేరాలకు దారితీస్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఈ కార్యక్రమంలో మావల సీఐ బీడీ ప్రేమ్ కుమార్, ఎస్ఐ రాజశేఖర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


