బిట్స్ పాఠశాలలో బాలికలకు సోషల్ మీడియా సురక్షిత వినియోగంపై అవగాహన సదస్సు.
ములుగు, :బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్, ములుగులో 9వ, 10వ తరగతి బాలికలకు సోషల్ మీడియా సురక్షిత వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సోషల్ మీడియా ప్రయోజనాలు, నష్టాలు, సైబర్ భద్రత, ఆన్‌లైన్ వేధింపులు మరియు వ్యక్తిగత సమాచార రక్షణపై అవగాహన కల్పించారు. సోషల్ మీడియాలో ఓటిపి, పాస్‌వర్డ్‌లు, వ్యక్తిగత వివరాలు ఎవరితోనూ పంచుకోకూడదని, తెలియని వ్యక్తుల ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను అంగీకరించకూడదని, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకూడదని విద్యార్థినులకు సూచించారు. ఏదైనా సైబర్ మోసం జరిగినా, ఆన్‌లైన్ వేధింపులు ఎదురైనా వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్‌లో తల్లిదండ్రుల ద్వారా ఫిర్యాదు చేయాలని తెలిపారు. “జాగ్రత్తగా వాడుదాం - సురక్షితంగా ఉందాం” అనే సందేశంతో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


